Breaking News
Home / States / Andhra Pradesh / Vizianagaram

Vizianagaram

టీడీపీలో భగ్గుమన్న విభేదాలు..

గజపతినగరం/విజయనగరం : గత ఏడాది జన్మభూమి కార్యక్రమంలో తహసీల్దార్‌ ఎదుటే వెలుగు ఏపీఎంపై అధికార టీడీపీకి చెందిన స్థానిక సర్పంచ్‌ నరవ ఆదిలక్ష్మి , ఎంపీటీసీలు కర్రిశ్రీదేవి, నరవ ప్రసన్నతోపాటు మరో ముగ్గురు దాడిచేసిన సంఘటన మరువక ముందే మళ్లీ ఆ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఉదంతంతో జన్మభూమి కార్యక్రమాన్ని తహసీల్దార్‌ అర్ధాంతరంగా ముగించేయాల్సి వచ్చింది. శుక్రవారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో జన్మభూమి గ్రామ …

Read More »

విజయనగరంలో భారీ అగ్నిప్రమాదం

పార్వతీపురం: విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పార్వతీపురంలోని ఓ స్ర్కాప్ దుకాణంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపునకు యత్నిస్తున్నారు. కాగా అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Read More »

అర్ధరాత్రి జ్యూట్ మిల్లు లాకౌట్….ఆందోళనలో కార్మికులు

నెల్లిమర్ల: విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల జ్యూట్ మిల్లుకు అర్ధరాత్రి యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. సంక్రాంతి పండుగ ముందు మిల్లు మూత పడడంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిల్లులో దాదాపు 3 వేల మంది పెర్మినెంట్, 2 వేల మంది వరకు కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు.

Read More »

టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి

విజయనగరం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనారోగ్యంతో మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే యర్రా అన్నపూర్ణమ్మ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అన్నపూర్ణమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స కోసం ఆమెను విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. బుధవారం చికిత్స పొందుతూ అన్నపూర్ణమ్మ మృతి చెందారు. అన్నపూర్ణమ్మ మృతిపై టీడీపీ నేతలు సంతాపం ప్రకటించారు. ఎమ్మెల్యేగా ఆమె చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

Read More »

విజయనగరం జిల్లాలో సరికొత్త హాట్‌టాపిక్‌

టీడీపీకి సేఫ్‌ జోన్‌ కావడంతో పెరుగుతున్న ఆశావహులు మంత్రి బరిలోకి దిగితే వైసీపీ అసమ్మతి నేతల మద్దతు? సునాయాసంగా విజయం సాధించవచ్చని భావిస్తున్న శ్రేణులు ఒత్తిడి తెస్తున్న కొంతమంది నాయకులు పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చలు విజయనగరం: పొరుగు జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు నెల్లిమర్ల వైపు చూస్తున్నారని సరికొత్త హాట్‌ టాపిక్‌ తెరపైకి వచ్చింది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇటువంటి వ్యాఖ్యలు సహజమే అయినా.. తెలుగుదేశం పార్టీ …

Read More »

హెల్మెట్‌ లేకుంటే పెట్రోల్‌ పోయొద్దు!

విజయనగరం: ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ వాడకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారని జిల్లా ఉప రవాణాశాఖ అధికారి భువనగిరి శ్రీకృష్ణవేణి అన్నారు. హెల్మెట్‌ ధరించని వారికి పెట్రోల్‌ పోయవద్దని బంకు యజమానులకు ఆదేశించారు. సోమవారం పట్టణంలోని పెట్రోల్‌బంక్‌లను సందర్శించి హెల్మెట్‌ ధరించని వాహనచోదకులకు, బంకు సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రహదారి ప్రమాదాల్లో తలకు బలమైన గాయం తగలడంతో ఎక్కువ మంది చనిపోతున్నారని, హెల్మెట్‌ ధరిస్తే …

Read More »

17న తీరం దాటే అవకాశం

విజయనగరం: రేపు మధ్యాహ్నానికి పెథాయ్‌ తుపాను తీవ్రరూపం దాల్చే అవకాశముందని విజయనగరం ఇంచార్జ్‌ కలెక్టర్‌ వెంకట రమణా రెడ్డి తెలిపారు. ఈనెల 17న సాయంత్రం ఒంగోలు- కాకినాడ మధ్య తీరం దాటే అవకాశముందన్నారు. గంటకు 90 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే సూచనలు కనిపిస్తోన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంటలు చేతికొచ్చే సమయం కావడంతో తుపానుకు అందకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోళ్లు వేగవంతం …

Read More »

మెహరీన్‌ రాకతో కిక్కిరిసిన జనం

విజయనగరం: విజయనగరం జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌ను ఆదివారం సినీతార మెహరీన్‌ ప్రారంభించింది. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి మూడు అంతస్థుల్లో ఉన్న మాల్‌ను ఆమె కలియతిరిగింది. వివిధ మోడల్స్‌ బంగారు ఆభరణాలు, పట్టు జరీ చీరలను చూసి మురిసిపోయింది. ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడంతో సీఎంఆర్‌ షాపింగ్‌మాల్‌ కిక్కిరిసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినియోగదారులు ఆకట్టుకునేలా మాల్‌లో …

Read More »

చంద్రబాబుకు కన్నా లక్ష్మీనారాయణ సవాల్‌……..

అవినీతిపరులంతా కలిసిపోయారు చంద్రబాబుకు ధైర్యముంటే సీబీఐ దర్యాప్తుకు సిద్ధపడాలి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విజయనగరం: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతిపరులంతా కలసి మహాకూటమిని ఏర్పాటు చేశారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. మహాకూటమి కాదు అది పెద్ద దొంగల కూటమి అని అభివర్ణించారు. పార్వతీపురంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నరేంద్ర మోదీ పాలననే స్వాగతిస్తున్నారని చెప్పారు. …

Read More »

నాలుగో తరగతి విద్యార్థినిపై అ‍త్యాచారం!

విజయనగరం : విజయనగరం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. శృంగవరపుకోట మండలం బొడ్డవర గ్రామంలో ఎంపీయూపీ స్కూల్లో 4వ తరగతి చదువుతున్న గిరిజన బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మంగళవారం స్కూలు పూర్తయ్యాక బస్‌ స్టాప్‌ వద్ద తన గ్రామానికి వెళ్లేందుకు వేచిచూస్తుండగా, ఓ యువకుడు మాయమాటలు చెప్పి చిన్నారిని తాటిపూడి దాటిన తర్వాత ఓ మామిడితోటలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం తీవ్ర రక్తస్రావం అవుతున్న బాలికను అక్కడే …

Read More »