Breaking News
Home / States / Andhra Pradesh / West Godavari

West Godavari

ఏలూరులో దారుణం… వృద్ధురాలిని చీరతో కట్టేసి…

ఏలూరు: తాడేపల్లిగూడెంలో దారుణం జరిగింది. పాత ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఇంటిని కూల్చేందుకు దుండగులు యత్నించారు. వృద్ధురాలిని చీరతో కట్టేసి జేసీబీలతో గోడలు కూల్చేశారు. 25 ఏళ్లుగా అదే ఇంట్లో అద్దెకు ఉంటున్నామని బాధితులు చెబుతున్నారు. తమ ఇంటిని కబ్జా చేసేందుకు ప్రకాశ్‌, అవినాశ్‌ అనే వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అయితే  యజమాని లండన్‌లో ఉండటంతో ఇంటిపై కన్నేసిన దుండగులు.. కబ్జా చేసేందుకు ప్రయత్నించారని స్థానికులు చెబుతున్నారు. దీనిపై పోలీసులకు …

Read More »

ఇళ్ల స్థలాల అర్హుల జాబితా గ్రామ సభ…

పశ్చిమ గోదావరి : ఉంగుటూరు మండలం నారాయణపురంలో ఇళ్ల స్థలాల అర్హుల జాబితా గ్రామ సభను శుక్రవారం నిర్వహించారు. సభలో తహశీల్దారు జాన్‌రాజు మాట్లాడుతూ.. మండలంలో ఇళ్లస్థలాల కోసం 2711 మంది, ఇంటి రుణాల కోసం 2611 మంది అర్హులను గుర్తించమని వెల్లడించారు.

Read More »

పెనుమంట్రలో సీపీఎం కార్యకర్తల సమావేశం….

పశ్చిమ గోదావరి: పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెర్వు సాయినాథ్‌ కళ్యాణ్‌ మండపంలో సీపీఎం పశ్చిమ గోదావరి డెల్టా జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బి.బలరాం మాట్లాడుతూ బీజేపీ హయాంలో రెండు కోట్ల ఉద్యోగాలు ఊడిపోవడంతో నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగిందన్నారు. కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాస్తున్న బీజేపీ న్యాయ వ్యవస్థలో వారికి అనుకూలంగా ఉన్న జడ్జిలను నియమించుకోవడం దారుణమైన పరిస్థితి అని పేర్కొన్నారు.

Read More »

నేడు నరసాపురం ఎంపీ రోడ్‌ షో…

పెనుగొండ: నరసాపురం పార్లమెంట్‌ సభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు పెనుగొండలో శుక్రవారం రోడ్‌ షో నిర్వహించారు. దొంగరావిపాలెం జాతీయ రహదారి నుంచి సిద్ధాంతం కసిరి సెంటర్లో రఘురామకృష్ణంరాజు రోడ్‌ షో చేస్తుండగా వైసీపీ నేతలు ఆయనకు పూలమాలలేసి అభినందనలు తెలిపారు.

Read More »

తేజస్వినిని పరామర్శించిన మంత్రి…

పశ్చిమ గోదావరి: ప్రేమోన్మాది దాడిలో గాయపడిన తేజస్వినిని మంత్రి రంగనాథరాజు పరామర్శించారు. ఈ నెల 16వ తేదీన ప్రేమోన్మాది సుధాకర్ రెడ్డి.. తేజస్వినిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో తేజస్విని కోలుకుంటోంది. సుధాకర్‌రెడ్డిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి రంగనాథరాజు పేర్కొన్నారు. తేజస్విని వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు.

Read More »

ఏలూరు జిల్లాలో దారుణం…

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మినీ బైపాస్‌ రోడ్డులో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు నాగరాజు అనే వ్యాయామ ఉపాధ్యాయుడిని హత్య చేశారు. కత్తితో పొడిచి అతి దారుణంగా హతమార్చి, 15 కాసుల బంగారం, రూ.2 లక్షలు ఎత్తికెళ్లినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Read More »

యువతిని చంపిన ప్రేమోన్మాది

పశ్చిమ గోదావరి : తనను ప్రేమించలేదన్న కారణంతో ఓ ప్రేమోన్మాది యువతిని దారుణంగా హత్య చేసిన ఘటన బుధవారం ఉదయం పశ్చిమ గోదావరి లో చోటు చేసుకుంది. కళాశాలకు వెళ్లేందుకు బస్సు కోసం బస్టాప్‌లో వేచివున్న యువతిపై కత్తితో దాడిచేసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం కవిటం గ్రామంలో జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల …

Read More »

పశ్చిమ గోదావరిలో దారుణం….

పోడూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని పోడూరు మండలం కవిటంలో ఓ యువతిని ప్రేమోన్మాది నరికి చంపిన దారుణం చోటుచేసుకుంది. యువతి కళాశాలకు వెళ్తుండగా కవిటం బస్టాప్‌ వద్ద సుధాకర్‌ అనే వ్యక్తి కత్తితో దాడి చేయడంతో ఘటనాస్థలిలోనే యువతి ప్రాణాలు కోల్పోయింది. అనంతరం విషం తాగి యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

Read More »

ప్రారంభమైన గాంధీ మహ సంకల్ప యాత్ర

పశ్చిమ గోదావరి : గత టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో గ్రామ స్వరాజ్యానికి విఘాతం కల్పిస్తే.. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం గ్రామ వాలంటీర్ల పేరుతో గ్రామ స్వరాజ్యానికి ఆటంకం కల్పిస్తోందని మాజీ మంత్రి బిజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు విమర్శించారు. జాతిపిత మహాత్మా గాంధీ 150 వ జయంతిని పురస్కరించుకొని.. ఈ నెల 2 నుండి బీజేపీ తలపెట్టిన గాంధీజీ మహా సంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా …

Read More »

పశ్చిమ గోదావరి జిల్లాలో మహిళ దారుణ హత్య…

పశ్చిమ గోదావరి: మహిళను గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో ముత్యాలమ్మ గుడి సమీపంలో రామలక్ష్మి(45) అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు రాడ్డుతో తలపై కొట్టి హత్య చేశారు. స్థానికులు సమాచారం మేరకు సి.ఐ.వి రవికుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని,  దర్యాప్తు చేస్తున్నారు.

Read More »