Breaking News
Home / States / Andhra Pradesh / West Godavari (page 10)

West Godavari

‘ద్వారకా తిరుమల’లో హీరో బాలయ్య సందడి

ఏలూరు: పవిత్ర హృదయం, భక్తి ఉండటం వల్ల హీరో నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి .. ‘శ్రీనివాసో విజయతే’ వంటి గ్రంధాలను వేలమంది భక్తులకు సమర్పించగలిగారని ‘ద్వారకా తిరుమల’ అర్చక, వేదపండిత బృందం ప్రశంసలు కురిపించింది. హీరో నందమూరి బాలకృష్ణ, వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ‘శ్రీనివాసో విజయతే’ ఏడువేల ప్రతులను ద్వారకా తిరుమల దేవస్థానం అధికారులకు అందజేశారు. అటు భక్తులకు కూడా …

Read More »

అమ్మఒడి సైట్‌ మూసివేత

ఏలూరు: అమ్మఒడి మూడోజాబితా (ఫారం-3) చేర్చిన విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలించి మరోదఫా అప్‌లోడ్‌ చేయడానికి ఉద్దేశించిన అమ్మఒడి సైట్‌ సోమవారం ఉదయం మూసివేశారు. జిల్లా వ్యాప్తంగా ఇంకా పలువురి ధ్రువపత్రాలు అప్‌లోడ్‌ చేయాల్సి ఉన్నప్పటికీ సైట్‌ను మూసివేయడంతో సాధ్యం కాలేదని విద్యాధికారులు చెబుతున్నారు. దీనివల్ల మరికొన్ని రోజులైనా మూడోజాబితాకు సంబంధించి ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేయడానికి సమయం ఇస్తే తప్ప పూర్తిస్థాయిలో సంబంధిత విద్యార్థులకు న్యాయం జరిగే అవకాశాలు లేవు.

Read More »

ఉద్యమాలు ఉధృతం చేస్తాము…

ప.గో.: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సోమవారం పాలకొల్లులో కుటుంబ సభ్యులతో నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రక్తం చిందించి అమరావతిని కాపాడుకుంటాం అంటూ.. నిమ్మల, రైతులు రక్తంతో వేలి ముద్రలు వేశారు. ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఉద్యమాలు ఉధృ‌తం చేస్తామని హెచ్చరించారు. రైతుల కన్నీటిలో సీఎం జగన్‌ కొట్టుకుపోవడం ఖాయమన్నారు. బోగస్‌ కమిటీలతో రాజధానుల నిర్ణయం సరికాదని నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు.

Read More »

తాండవనదిలో మృతదేహంపై వీడిన మిస్టరీ

తాండవనదిలో లభ్యమైన మృతదేహంపై వీడిన మిస్టరీ ఇద్దరు నిందితుల అరెస్టు తుని: కక్షతో స్నేహితుడిని ఇద్దరు యువకులు తాండవ నదిలోకి తోసేశారని రూరల్‌ సీఐ కిషోర్‌బాబు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు తుని రూరల్‌ పోలీసు స్టేషన్‌లో సీఐ శనివారం నిందితుల వివరాలను ప్రకటించారు. గత నెల 22న తుని మండలం డి.పోలవరం, నందిఒంపు ప్రాంతాల మధ్య …

Read More »

ఏలూరులో మహిళల ఆందోళన

పశ్చిమ గోదావరి : తమ సొంత నిధులతో ఏర్పాటు చేసిన భవనంలో వేరొక డివిజనుకు చెందిన వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆదివారపు పేట వద్ద స్థానిక మహిళలు ఆందోళన చేపట్టారు. బిల్‌ కలెక్టర్‌ లోపల ఉండగానే.. బయట సచివాలయానికి తాళాలు వేసి మహిళలు నిరసన తెలిపారు. వార్డు సచివాలయం బోర్డులో 47 వ డివిజన్‌ కు బదులుగా 49 వ డివిజన్‌ …

Read More »

టీడీపీ నాయకులు ఉత్తరాంద్ర ద్రోహులుగా మిగిలిపోతారు

తాడెపల్లిగూడెం: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఇవాళ తాడెపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ రాజధానిలో పర్యటించి రైతుల పక్షాన ఉంటానని డబ్బాడు పెరుగన్నం తిన్నాడని వ్యాఖ్యానించారు. ఆ పెరుగన్నం అరగక ముందే హైదరాబాద్ వెళ్లి పవన్ కళ్యాణ్ మాట మార్చారని విమర్శించారు. అంతటితో ఆగని ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు గురించి మాట్లాడుతూ.. పులివెందుల పంచాయితీ అంటూ టీడీపీ …

Read More »

కంటి పరీక్షలు చేయించుకున్న సీఎం జగన్…

ఏలూరు: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏలూరు ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో స్టాల్స్‌ని తిలకించారు. ఈ సందర్భంగా.. వైఎస్ జగన్ కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఏలూరు పర్యటనలో భాగంగా.. రూ.50 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. రూ. వెయ్యి పైబడి ఖర్చయ్యే వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని సీఎం స్పష్టం చేశారు. కొత్తగా మరో వెయ్యి వ్యాధులకు ఆరోగ్యశ్రీ …

Read More »

నరసాపురం-సికింద్రాబాద్‌ మధ్య ఆరు స్పెషల్‌ రైళ్లు

నరసాపురం: సంక్రాంతి రద్దీని పురస్కరించుకుని నరసాపురం-సికింద్రాబాద్‌ మధ్య ఆరు స్పెషల్‌ రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్‌ నుంచి జనవరి 10, 11, 12, 13 తేదీల్లో ఈ స్పెషల్‌ రైళ్లు బయలుదేరనున్నాయి. తిరుగు ప్రయాణంలో నరసాపురం నుంచి 18, 19 తేదీల్లో నడవనున్నాయి. 10న 82725 నెంబర్‌తో సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్‌ రైలు నల్లగొండ, గుంటూరు మీదుగా ఉదయం 4.30 …

Read More »

ఆరోగ్యశ్రీ పైలట్‌ ప్రాజెక్టుకు ఏపీలో నేడు శ్రీకారం

ఏలూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పైలట్‌ ప్రాజెక్టును నేడు ఏలూరులో లాంఛనంగా ఆరంభించనున్నారు. ఆరోగ్యశాఖ పరిధిలో ఇప్పటికే 1059కి పైగా రోగాలకు చికిత్స నిర్వహిస్తుండగా, దీనికి అదనంగా మరో వెయ్యిరకాల అదనపు శస్త్ర చికిత్సలు, రోగాలకు వైద్యం అందించేందుకు వీలుగా పశ్చిమగోదావరి జిల్లాను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. దాదాపు 12,45,500 కుటుంబాలను వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చేలా ప్రభుత్వం రూపకల్పన చేసింది. తొలిగా జిల్లాలోని …

Read More »

ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో డ్యాన్సులు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో రికార్డింగ్ డ్యాన్సులు కలకలం రేపాయి. పట్టపగలే ఆస్పత్రి సిబ్బంది డ్యాన్సులతో హోరెత్తించారు. పెద్ద సౌండ్‌తో డ్యాన్సులతో ఆస్పత్రి సిబ్బంది హడలెత్తించారు. డ్యాన్సులు చేసిన వారిలో నర్సులు, ఫార్మాసిస్ట్‌లు, నర్సింగ్ స్టూడెంట్స్, పారిశుద్ధ్య సిబ్బంది ఉండడం విశేషం. ఆస్పత్రి సిబ్బంది తీరుపై రోగులు, బంధువులు మండిపడుతున్నారు. ఇదేం పద్ధతి అంటూ ప్రశ్నిస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read More »