Breaking News
Home / States / Andhra Pradesh / West Godavari (page 2)

West Godavari

పశ్చిమగోదావరిలో 329 టెన్త్ పరీక్షా కేంద్రాలు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో 329 పదో తరగతి పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయనున్నారు.  50 వేల 27 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. కాగా విద్యార్థులకు పరీక్షా కేంద్రాలు ఎంచుకునే వెసులుబాటును అధికారులు కల్పించారు.

Read More »

కొంపముంచిన టిక్‌టాక్‌

రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం ట్రాఫిక్‌ విభాగంలో పనిచేస్తున్న చేకట్ల శ్రీనివాస్‌ అలియాస్‌ అమలాపురం శ్రీను నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో అతడ్ని విధులనుంచి తొలగించినట్లు ఎస్‌పీ షిమొషిబాజ్‌పాయ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 2012నుంచి రాజమహేంద్రవరం హోంగార్డ్స్‌ యూనిట్‌లో పనిచేస్తున్న అతడు అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడినట్లు, ఇటీవల టిక్‌టాక్‌లో వీడియోలు చేసి రాజకీయనాయకులు, ప్రభుత్వం పైనా ఆరోపణలు చేస్తూ అప్‌లోడ్‌ చేశాడు. దీంతో అతడిపై వచ్చిన ఆరోపణల మీద విచారణ జరిపిన …

Read More »

దేవాలయాలు తెరవాలంటూ వినూత్న నిరసన…

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం కస్పా పెంటపాడులో ప్రజలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితులలో లిక్కర్ షాపులకు అనుమతులు ఇచ్చి… దేవాలయాలకు అనుమతులు ఇవ్వకపోవడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీసం ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు దేవాలయాల్లోకి షరతులతో కూడిన దర్శనం కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Read More »

పోలీసులపై 300 మంది కూలీలు దాడి..

లాక్‌డౌన్‌ సడలింపు నేటి నుంచి అమల్లోకి రావడంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కూలీలు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో పోలీసులపై వలసకూలీలు దాడికి పాల్పడడం కలకలం రేపింది. పోలీసులపై రాళ్లు, సీసాలతో వలస కూలీలు దాడి చేశారు. దీంతో లాఠీచార్జి చేసిన పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తమ రాష్ట్రాలకు తమను తిరిగి పంపాలంటూ దాదాపు 300 …

Read More »

సచివాలయ ఉద్యోగికి కరోనా…

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో సచివాలయ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ర్యాపిడ్ టెస్టుతో అతడికి కరోనా లక్షణాలు ఉన్నట్లు బయటపడింది. ఈ విషయాన్ని మండల అధికారులు ధృవీకరించారు. వెంటనే కరోనా బాధితుడిని ఏలూరు కోవిడ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృభిస్తోంది. నిన్న ఒక్కరోజే 71 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1403కు …

Read More »

ఏలూరులో రెడ్‌జోన్ నిబంధనలు సడలింపు…

కాకినాడ: పశ్చిమగోదాపగోదావరి జిల్లా ఏలూరు విద్యానగర్‌లో అధికారులు రెడ్‌జోన్ నిబంధనలకు సడలింపునిచ్చారు. ఆ ప్రాంతంలో గత 14 రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. దీంతో విద్యానగర్ ప్రాంతాన్ని రెడ్‌జోన్ నుంచి ఆరెంజ్‌‌జోన్‌గా మార్చారు. గతంలో ఒక వ్యక్తికి పాజిటివ్ రావడంతో విద్యానగర్‌లో రెడ్‌జోన్ నిబంధనలు అమలు చేసిన విషయం తెలిసిందే.

Read More »

రేపు తణుకు నియోజకవర్గం బంద్‌

తణుకు: తణుకు నియోజకవర్గ బంద్‌ను ఆదివారం ప్రజలు స్వచ్ఛందంగా విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ప్రతీ ఆదివారం స్వచ్ఛందంగా బంద్‌ పాటించి విజయవంతం చేస్తున్నారన్నారు. ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతోనే బంద్‌ నిర్ణయం తీసుకున్నామన్నారు.

Read More »

అటవీప్రాంతంలో బాలరాజు పర్యటన

పశ్చిమగోదావరి: ఏజెన్సీలోని అటవీప్రాంతంలో బాహ్యప్రపంచానికి దూరంగా కనీస వసతులు కరువై జీవనం సాగిస్తున్న గోగుమిల్లి, చింతపల్లి, గడ్డపల్లి, దారావాడ, చిలకలూరు తదితర గ్రామాల్లోని సుమారు 1800 కొండరెడ్డి కుటుంబాలకు బుధవారం నాగ భూషణం, ఎం.రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువులను ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఐటీడీఏ పీవో ఆర్‌వి సూర్యనారాయణ  చేతుల మీదుగా పంపిణీ చేశా రు.  గిరిజనులకు మాస్క్‌లు పంపిణి చేయడంతో పాటు కరోనా నివారణకు  తీసుకోవాల్సిన జాగ్రత్తలపై …

Read More »

తాడేపల్లిగూడెంలో మరో వ్యక్తికి కరోనా

పశ్చిమగోదావరి: జిల్లాలోని తాడేపల్లిగూడెంలో మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యలు నిర్ధారించారు. తాడేపల్లిగూడెంలో తొలి అనుమానిత వ్యక్తి బంధువుకు కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా పాజిటివ్ బాధితుడి ఇంటి ప్రాంతాన్ని అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు.

Read More »

రేపటి నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం

కాకినాడ: పశ్చిమగోదావరి జిల్లాలో చేపల వేటపై ప్రభుత్వం నిషేధం విధించింది. రేపటి నుంచి సముద్రంలో చేపలు పట్టడంపై ఆంక్షలు విధించింది. దాదాపు 61రోజుల పాటు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. చేపల వేట విరామ సమయంలో ఒక్కో మత్స్యకారునికి ప్రభుత్వం నెలకు రూ.5వేల నగదు ఇవ్వనుంది.

Read More »