Breaking News
Home / States / Andhra Pradesh / West Godavari (page 20)

West Godavari

బ్యాంకింగ్‌ రంగాన్ని పరరక్షించుకోవాలి

తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి): జాతీయ బ్యాంకుల విలీన ప్రక్రియను నిరసిస్తూ అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం, భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య పిలుపు మేరకు మంగళవారం బ్యాంకు ఉద్యోగులు బ్యాంకింగ్‌ రంగాన్ని పరిరక్షించాలంటూ ప్రదర్శనలు చేశారు. బ్యాంకుల ఎదుట డిమాండ్లతో కూడిన నినాదాలతో ధర్నా చేశారు. సమ్మెలో ఉన్న బ్యాంకు ఉద్యోగులు బృందాలుగా బయలుదేరి పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులను మూయించివేశారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మె ప్రభావం బ్యాంకుల లావాదేవీలపై పడింది. …

Read More »

ఇంటి గోడ కూలి ఇద్దరు మృతి…

పశ్చిమ గోదావరి: ఏలూరులోని ఉంగుటూరు మండలం నారాయణపురంలో విషాదం చోటుచేసుకుంది. వర్షాలకు ఇంటి గోడ కూలి ఇద్దరు మృతిచెందారు. మృతులు సిరవరపు శ్రీను (40) పెద్దిరెడ్డి రాఘవమ్మా (60)గా గుర్తించారు.

Read More »

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ స్వాధీనం…

పశ్చిమ గోదావరి: జంగారెడ్డిగూడెం మండలంలోని పంగిడి గూడెం గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను విఆర్‌ఒ కాంతారావు సీజ్‌ చేశారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారన్న సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న విఆర్‌ఒ ఇసుక ట్రాక్టర్‌ను సీజ్‌ చేశారు.

Read More »

చింతమనేనికి 14రోజుల రిమాండ్‌

ప.గో: చింతమనేని ప్రభాకర్‌పై మరో కేసు నమోదైంది. జోసఫ్‌ అనే వ్యక్తిని బెదిరించిన కేసులో చింతమనేనిని మూడో నిందితుడిగా పోలీసులు చేర్చారు. పీటీ వారెంట్‌పై ఆయనను ఏలూరు కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. ఈ నేపథ్యంలో కోర్టు చింతమనేనికి 14రోజుల రిమాండ్‌ విధించింది.

Read More »

గోదావరిలో మృతదేహం లభ్యం

ఆత్రేయపురం: ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక శివారు కాటన్‌ బ్యారేజీ 52వ గేటు వద్ద గుర్తుతెలియని మృతదేహం సోమవారం లభ్యమైంది. లాక్‌ పర్యవేక్షకుల సమాచారం మేరకు ఎస్‌ఐ జి.నరేష్‌ సిబ్బందితో వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మత్స్యకారుల సహాయంతో నాటు పడవపై బయ టకు తీసుకువచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనికి సంబంఽధించి విచారణ నిర్వహిస్తున్నారు.

Read More »

కడుపు నొప్పి తట్టుకోలేక ఆత్మహత్య….

పశ్చిమ గోదావరి : కడుపునొప్పి భరించలేక వివాహిత ఉరేసుకొని మృతి చెందిన ఘటన సోమవారం చింతలపూడి మండలంలో చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం రామకృష్ణ నగర్‌ లో కడుపునొప్పి భరించలేక మల్లి మారేశ్వరి (25) అనే వివాహిత ఉరి వేసుకొని మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Read More »

ఇసుకను వెంటనే సరఫరా చేయాలి….

పశ్చిమ గోదావరి : భవన నిర్మాణ కార్మికులను వెంటనే ఆదుకోవాలని, ఇసుకను వెంటనే సరఫరా చేయాలని కోరుతూ.. సిఐటియు-భవన నిర్మాణ సంక్షేమ సంఘం కార్మికుల ఆధ్వర్యంలో ఆకివీడులో భవన నిర్మాణ కార్మికులు సోమవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నారపల్లి రమణరావు, ఆకివీడు మండల కార్యదర్శి ఆంజనేయులు ప్రసంగించారు.

Read More »

తహశీల్దార్‌కు మాలమహానాడు వినతి….

పశ్చిమ గోదావరి : ఆకివీడు మండలం తాళ్లకోడిలో ప్రభుత్వం సేకరించిన 74 ఎకరాల భూమిలో ప్రజలకు జి ప్లస్‌ వన్‌ భవనాలను నిర్మించి అయిదువేలమంది కుటుంబాలకు సౌకర్యాన్ని కల్పించాలని కోరుతూ తహశీల్దార్‌కు మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి కటికల రాజారావు సోమవారం వినతిపత్రాన్ని సమర్పించారు.

Read More »

నిరుపేదలకు న్యాయం చేయాలి….

పశ్చిమ గోదావరి : బందరు పుంత భూమిని సేకరించి ఇళ్ళ స్థలాలను నిరుపేదలకు ఇవ్వాలని కోరుతూ.. సీపీఎం ఆధ్వర్యంలో  తహశీల్దార్‌ కార్యాలయంలో సోమవారం ధర్నా నిర్వహించారు. బడాబాబుల ఆక్రమణలో ఉన్న బందరు పుంత భూమిని సర్వే చేసి వెలికితీయాలని, నిరుపేదలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

Read More »

ఏలూరులో జరిగిన స్పందన కార్యక్రమం….

పశ్చిమ గోదావరి : పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు పోలీస్‌ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫిర్యాదుదారుల వద్ద నుండి జిల్లా ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో అక్రమ బాణాసంచా నిల్వ ఉంచితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లైసెన్స్‌ లు కలిగి ఉన్న దుకాణాలలోనే బాణాసంచాలను కొనుగోలు చేయాలంటూ వినియోగదారులకు సూచించారు.

Read More »