Breaking News
Home / States / Andhra Pradesh / West Godavari (page 26)

West Godavari

హైకోర్టును తరలిస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాము….

ఏలూరు: హైకోర్టును తరలించవద్దని పశ్చిమగోదావరి జిల్లా న్యాయవాదులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్నచోటే హైకోర్టు కొనసాగించాలన్నారు. రాయలసీమకు తరలిస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు. అమరావతి నుంచి హైకోర్టును కర్నూలుకు తరలిస్తారన్న ప్రచారంతో న్యాయవాది వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ సందర్భంగా న్యాయవాదులు మీడియాతో మాట్లాడుతూ… కొంతమంది ప్రొద్భలం, కుట్రతో హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలు వస్తున్నాయన్నారు. దీంతో తాము గత 10 రోజుల నుంచి …

Read More »

విద్యుత్ షాక్‌తో గేదె మృతి…

పశ్చిమ గోదావరి: మంగళవారం అచ్చుతాపురంలో రోడ్డు పక్క ఉన్న నీటి గుంటలో కరెంట్‌ తీగ జారిపడటంతో నీళ్లలో విద్యుత్‌ ప్రవహిస్తుంది. ఇది తెలియని అచుతాపురం గ్రామానికి చెందిన రైతు పేరం విరాజు గేదె అదే మార్గం గుండా వెళ్లి నీటిలో కాలుపెట్టింది. దీనితో విద్యుత్‌ షాక్‌కు గురై ఆ గేదె అక్కడికక్కడే మృతి చెందింది.

Read More »

భవన నిర్మాణ కార్మికుల సంఘం ర్యాలీ…

పశ్చిమ గోదావరి: మంగళవారం చింతలపూడి మండలంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు ర్యాలీ నిర్వహించారు. ‘ ఇల్లైనా కట్టాలి.. పనైనా చూపాలి ‘ అంటూ నినాదాలు చేశారు. వందలాది మంది ఇసుక దొరక్క ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందారు. వెంటనే ఇసుక ర్యాంపులను మండలంలో ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

Read More »

మద్యం దుకాణాలు వద్దు….గ్రామస్తుల ఆందోళన…

పశ్చిమ గోదావరి : ఉంగుటూరు లో మద్యం దుకాణాలు వద్దంటూ.. గ్రామస్తులు మంగళవారం ఆందోళన చేపట్టారు. హై స్కూల్‌ కి వెళ్లే దారిలో ప్రభుత్వ మద్యం దుకాణం ఎలా పెడతారంటూ.. విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన తెలిపారు.

Read More »

అక్రమంగా నిల్వచేసిన బాణాసంచా స్వాధీనం…

పశ్చిమ గోదావరి : సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలోని వందనపు గిరి కిరాణా దుకాణంలో పోలీసులు గుట్కా తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఒక గోడౌన్‌లో అక్రమంగా దాచిన 47000 రూపాయల ఖరీదు చేసే బాణసంచాను గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

Read More »

సీఎం పర్యటన…ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష…

పశ్చిమ గోదావరి : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అక్టోబర్‌ 4వ తేదీన ఏలూరు పర్యటన ఖరారైన నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లపై సోమవారం ఇండోర్‌ స్టేడియంలో అధికారులతో జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాల రాజు సమీక్ష నిర్వహించారు. ఏర్పాట్ల పై అధికారులకు తగు సూచనలు చేశారు.

Read More »

ఏసీఆర్ చిట్ ఫండ్ యజమానులు అరెస్ట్…

పశ్చిమ గోదావరి: కొవ్వూరులో బోర్డు తిప్పేసిన ఏసీఆర్ చిట్ ఫండ్ కేసులో యజమానులు చిన్నారావు, అతని కుమారుడు పూర్ణసురేష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. 12కోట్ల రూపాయల మేరకు చిట్‌ఫండ్ యజమానులు ప్రజలను మోసగించినట్టు పోలీసులు నిర్ధారించారు. 1200 మంది ఖాతాదారులను మోసం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

Read More »

బోటు వెలికితీసేందుకు బాలాజీ మెరైన్స్ సంస్థ ఏర్పాట్లు

రాజమండ్రి: కచ్చులూరు వద్ద బోటు వెలికితీసేందుకు కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. రోడ్డు మార్గంలో సంఘటన స్థలానికి జేసీబీ, ప్రత్యేక రోప్‌లను తరలిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా పశివేదలకు చెందిన సాహాసవీరుడు వెంకట శివ పర్యవేక్షణలో గోదావరిలో మునిగిన బోటును వెలికితీసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటును వెలికి తీసేందుకు జగన్ ప్రభుత్వం కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్ సంస్థకు అనుమతి ఇచ్చింది. …

Read More »