Breaking News
Home / States / Andhra Pradesh / West Godavari (page 3)

West Godavari

ఇకపై జిల్లాలోనే కరోనా పరీక్షలు

కాకినాడ: కరోనా ప్రాథమిక నిర్ధారణ పరీక్షలను ఇక నుంచి జిల్లాలోనే నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏలూరు మెడికల్ కాలేజ్‌లో అధికారులు ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్‌లో ప్రతీ రోజు 200 నమూనాలను పరీక్షించనున్నారు.

Read More »

బ్యాంకులను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే..

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బ్యాంకులను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. బ్యాంకులో గుంపులుగా జనాన్ని చూసి ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. బ్యాంకు ఖాతాదారులు కనీసం రెండు మీటర్ల దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం రూ.500 జమ చేయడంతో వాటిని తీసుకోవడానికి ఖాతాదారులు క్యూ కట్టారు. రెండు మీటర్ల దూరాన్ని పాటించే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గ్రంధి …

Read More »

ఆగి ఉన్న బస్సులో అగ్ని ప్రమాదం…

పశ్చిమ గోదావరి: నర్సాపురం ఆర్టీసీ గ్యారేజ్‌లో ఆగి ఉన్న బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎండవేడికి బస్సులోని విద్యుత్ వైర్లు ఫైర్ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది.. నీళ్ళు జల్లి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో బస్సు పాక్షికంగా దగ్ధమైంది.

Read More »

ఆ ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించండి…

ఏలూరు : కరోనా అనుమానితులను ఎప్పటికప్పుడు క్వారంటైన్‌కు పంపించాలని ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు. ఏలూరులోని మున్సిపల్‌ కార్యాలయంలో మంత్రి ఆళ్లనాని అధికారులతో కలిసి శనివారం కరోనాపై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పోలీసు, మెడికల్‌ టీమ్స్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. పాజిటివ్ వచ్చినవారి కుటుంబ సభ్యులు సహకరించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించాలన్నారు. …

Read More »

ప్రాణాలు పోయేలా చేసిన పోలీస్ సైరన్…

లాక్‌డౌన్ వేళ సమయంలో గస్తీ కాస్తున్న పోలీసుల వాహనం సైరన్ వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలోని పాలకొల్లులో లాక్‌డౌన్ సమయంలో బయటకు వచ్చిన ఓ వ్యక్తి పోలీస్ సైరన్ మోగగానే టెన్షన్‌తో గుండెపోటుకు గురై చనిపోయాడు. మరో వ్యక్తి కూడా దాదాపు ఇలాంటి పరిస్థితుల్లోనే చనిపోయాడు. కరోనా నుండి రక్షించుకోవడానికి ప్రజల్ని ఇళ్లలో ఉండమని ప్రభుత్వాలు చెబుతున్నా కొంతమంది వినకుండా.. ఇలాంటి పరిస్థితుల్లో మరణిస్తున్నారు.

Read More »

ఫోన్‌లో వైద్యం…ఆన్‌లైన్‌లో ఫీజు!

కాకినాడ : కాకినాడలో ఓ కుటుంబం.. భర్త గుజరాత్‌లో ఓఎన్‌జీసీలో సైట్‌ ఇంజనీర్‌. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్‌డౌన్‌తో అతను ఇంటికి రాలేదు. సైట్‌లోనే ఓ బంకర్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఇంటి వద్ద ఉన్న భార్య ఓ కార్పొరేట్‌ స్కూల్‌లో టీచర్‌. వీరి పాపకు రెండు రోజుల నుంచి జ్వరం. దీంతో కాకినాడ దేవాలయం వీధిలో ఉన్న ఓ మెడికల్‌ ఫిజీషియన్‌ ఈ కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్‌ కావడంతో …

Read More »

ఢిల్లీ సభకు వెళ్లొచ్చాకే ఘటన….?

ఢిల్లీ సభకు వెళ్లొచ్చాకే ఘటన ‘కరోనా’ను ధ్రువీకరించని వైద్యులు విజయవాడ/కాకినాడ: ఏపీలో ముగ్గురు వ్యక్తులు కరోనా అనుమానిత లక్షణాలతో మరణించారు. వైద్యాధికారులు మాత్రం ఇతర అనారోగ్య కారణాలవల్లే వీరు చనిపోయినట్లు తెలిపారు. వీరు ముగ్గురూ ఇటీవల ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు హాజరైన వారే. విజయవాడకు చెందిన మహిళ ఆదివారం మరణించగా, సోమవారం ఆమె భర్త కూడా చనిపోయారు. తూర్పు గోదావరి జిల్లా కాతేరుకు చెందిన వ్యక్తి (62) సోమవారం …

Read More »

ఏలూరులో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి…

ఏలూరు: లాక్‌డౌన్ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆంక్షలను తీవ్రతరం చేశారు. ఫైర్ స్టేషన్ సెంటర్‌లో రాకపోకలను పోలీసులు నిషేధించారు. టూ వీలర్ పై ఒకరు, కారులో ఇద్దరి కంటే ఎక్కువ మంది ప్రయాణిస్తే కేసులు నమోదు చేస్తున్నారు. అత్యవసర సేవలకు మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు.

Read More »

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య ఐదుకు….

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. విజయవాడలో ఒకటి, కాకినాడలో మరొకటి తాజాగా నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ రెండు కేసులూ విదేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి లండన్‌ నుంచి హైదరాబాద్‌కు.. అక్కడి నుంచి రాజమండ్రికి వచ్చాడు. మరో వ్యక్తి ఫ్రాన్స్‌ నుంచి ఈ నెల 17వ తేదీన …

Read More »

ద్వారకా తిరుమల ఆలయం మూసివేత…

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల ఆలయాన్ని కూడా మూసివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కరోనా విస్తరణ కట్టడి దృష్ట్యా దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు మధ్యాహ్నం నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతించరాదని నిర్ణయించారు. ఇప్పటికే ఆర్జిత సేవలను రద్దు చేశారు. తాజాగా భక్తుల దర్శనంతోపాటు కేశఖండనశాల, అన్నప్రసాద వితరణ కేంద్రాలు కూడా మూసివేయాలని నిర్ణయించారు. ఆన్ లైన్ టికెట్ల విక్రయాన్ని తాత్కాలికంగా నిలిపివేయనున్నారు.

Read More »