Breaking News
Home / States / Andhra Pradesh / West Godavari (page 4)

West Godavari

ఏలూరులో మరో కరోనా అనుమానిత కేసు

ఏలూరు: ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరో కరోనా అనుమానిత కేసు నమోదైంది. కృష్ణా జిల్లా కైకలూరు వద్ద ఆచవరానికి చెందిన వ్యక్తికి కరోనా లక్షణాలున్నట్టు వైద్యులు గుర్తించారు. కొద్దిరోజుల క్రితం సదరు అనుమానితుడు హైదరాబాద్‌కి వెళ్లి వచ్చాడు. అప్పటి నుంచి ఏలూరు గవర్నమెంటు హాస్పటల్‌లో ఐసోలేషన్ వార్డులో వైద్యులు చికిత్సను అందిస్తున్నారు.

Read More »

కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం…

పశ్చిమగోదావరి: వైసీపీపై బీజేపీ ఎంపీ జీవీఎల్ మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష అభ్యర్థులపై దాడులు చేస్తూ బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి, చిత్తూరు, ఏలూరులో ప్రతిపక్షాలపై దాడులను ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.

Read More »

భారీగా బంగారం పట్టివేత…

పశ్చిమగోదావరి: జిల్లాలోని పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఇరగవరం మండలం కంతేరులో భారీగా బంగారం పట్టుబడింది. సరైన పత్రాలు లేని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Read More »

పోలవరం వ్యయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఏపీ: పోలవరం ప్రాజెక్టు భూసేకరణ వ్యయాన్ని భరించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలవరం సవరించిన అంచనా వ్యయం రూ.55,545 కోట్లు కాగా, రూ.48 వేల కోట్ల వ్యయానికి కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు కేంద్రం రూ.16వేల కోట్లు ఖర్చు చేసింది. మిగతా రూ.32 వేల కోట్లనూ భరించేందుకు తాజాగా ఓకే చెప్పింది. ఆడిటింగ్ పూర్తవ్వగానే కేంద్రం నుంచి ఈ నిధులు విడుదల కానున్నాయి.

Read More »

స్థానికంలోనూ ‘నోటా’

ఏలూరు: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ఎన్నికల బ్యాలెట్‌ పత్రాల్లో నోటాకు చోటు కల్పించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు బ్యాలెట్‌ పత్రాలు సిద్ధమవుతున్నాయి. దీంతో ఇది పెద్ద తలనొప్పేనని నాయకులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఏప్రిల్‌లో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ నోటాకు కొన్ని ప్రధాన పార్టీల కన్నా ఎక్కువ ఓట్లు రావడమే దీనికి కారణం. ఇప్పటివరకు ఈవీఎంలలో మాత్రమే నోటాకు …

Read More »

వందకు వంద శాతం గెలుచుకుంటాం

పశ్చిమ గోదావరి: స్థానిక సంస్థల ఎన్నికల్లో వందకు వంద శాతం స్థానాలు గెలుచుకుంటామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబు అన్నారు. అవినీతికి తావు లేకుండా ప్రజలకు పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ వాలంటీర్ల ద్వారా గడప వద్దకే పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. వెయ్యి రూపాయలు దాటిన చికిత్సకు ఆరోగ్య శ్రీ పథకాన్ని …

Read More »

అభాగ్యుల పాలిట అన్నదాత తులసీరామ్‌

భీమవరం: కన్నబిడ్డలే తల్లిదండ్రులను భారంగా భావిస్తున్న రోజులువి. అటువంటిది క్రమం తప్పకుండా ఏ ఆధారము లేని వృద్ధులకు ప్రతి రోజు భోజనం పంపిస్తున్నారు. అదీ వృద్ధులున్నచోటకే క్యారేజీలు పంపించడం విశేషం. ఇలా పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు వీరవాసరం మండలం పంజా వేమవరం గ్రామానికి చెందిన మళ్ల తులసీరామ్‌(రాంబాబు). రైస్‌మిల్లర్‌గా, రొయ్యల రైతుగా తాను సంపాదించేదానిలో కొంతమొత్తాన్ని వృద్ధుల సేవకు వినియోగిస్తున్నారు. రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు యండగండి గ్రామంలో …

Read More »

పెళ్లైన పది నెలలకే విషాదం…

ఆయనకు పెళ్లై 10 నెలలే. అన్యోన్యంగా సాగుతున్న జీవితం. ఉమ్మడి కుటుంబం. వారం క్రితమే కొత్త ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రోడ్డు ప్రమాదం రూపంలో ఆ యువకుడిని మృత్యువు కబళించింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సురేష్  కి 10 నెలల క్రితం  మత్స్యపురి గ్రామానికి చెందిన సాయి వెంకటరమణతో వివాహం జరిపించారు. వీరిది ఉమ్మడి కుటుంబం. అంతా కలిసే జీవిస్తున్నారు. సురేష్ ఆక్వా రైతుగా గ్రామంలో అందరికి సుపరిచితుడు. …

Read More »

27 ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు మంజూరు చేస్తాం

కొవ్వూరు: రాష్ట్రవ్యాప్తంగా 27 ఫుడ్‌ పార్క్‌ పరిశ్రమలు మంజూరయ్యాయని, వాటిలో తొమ్మిది ఉభయ గోదావరి జిల్లాలో నెలకొల్పనున్నట్టు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి రామేశ్వర్‌ తెలిపారు. పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ చీఫ్‌ విప్‌ భరత్‌రామ్‌ మాట్లాడారు. ఏపీఈడీఏ అగ్రికల్చర్‌ అండ్‌ ప్రాసెస్డ్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ ఎక్స్‌పోర్టు డెవలప్‌మెంట్‌ అథారిటీ, ఎంపీఈడీఏ మెరైన్‌ ప్రోడెక్ట్స్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎక్స్‌పోర్టు అథారిటీ మంత్రిత్వ …

Read More »

కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాధపురంలో ఓ కారు ప్రమాదవశాత్తు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మృతులు మత్యపురి, కాజా గ్రామాలకు చెందిన సురేష్‌(22), చిట్టియ్య(45), కాశీ(22)గా గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కారును వెలికితీసింది. రొయ్యల సీడ్‌ కోసం వెళ్తుండగా ఘటన జరిగింది. మృతదేహాలను పాలకొల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Read More »