Breaking News
Home / States / Andhra Pradesh / West Godavari (page 5)

West Godavari

ఐసోలేషన్ వార్డు ఏర్పాటు…

రాజమండ్రి: కరోనా వైరస్‌పై పశ్చిమగోదావరి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన 23 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో 19 మందికి నెగిటివ్ రాగా… మరో నలుగురికి వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోంది. అటు ఏలూరు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ముందస్తుగా ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు.

Read More »

సీఎం ఔదార్యం

ఏలూరు: ఎన్నో సెక్యూరిటీ ఆంక్షలు.. పూర్తి స్థాయి బందోబస్తు.. ఎటూ చూసినా పోలీసుల నిఘా కన్ను.. ఇంతటి భద్రతా వలయం మధ్య ముఖ్యమంత్రి కాన్వాయ్‌ వెళ్తుండగా పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద శుక్రవారం రోడ్డు పక్కన ఓ కుటుంబం కాగితం పట్టుకుని నిలుచుంది. వారు సీఎం కంట పడాలని ప్రయత్నిస్తుంటే భద్రతా విభాగం సిబ్బంది అడ్డుకుంటున్నారు. ఆ దృశ్యాన్ని కాన్వాయ్‌లో వెళ్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ గమనించి.. కాన్వాయ్‌ని …

Read More »

2021 నాటికి పోలవరం పూర్తి

పశ్చిమగోదావరి : ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టును 2021 జూన్ కంటే ముందే పూర్తయ్యేలా ప్రణాళికలు రచించామని మంత్రి తానేటి వనిత అన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ పనులను శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించిన విషయం తెలిసిందే. అనంతరం మంత్రి వనిత మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు పనులను విస్తృతంగా సమీక్షించారని, వీలైనంత త్వరగా పనులు పూర్తయ్యే విధంగా అధికారులకు స్పష్టమైన అదేశాలు ఇచ్చారని తెలిపారు. …

Read More »

అభివృద్ధిని టీడీపీ ఓర్వలేకపోతుంది..

ఏలూరు: గత టీడీపీ ప్రభుత్వంలో దళిత వర్గాలను పూర్తిగా అణచి వేశారని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని విమర్శించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. పేదలకు కనీసం ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వకుండా మోసం చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీ నేతలు ఓర్వ లేకపోతున్నారన్నారు. రేషన్‌, పింఛన్‌ కార్డులు తీసేశామని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఉగాదికి అర్హత ఉన్న అందరికీ …

Read More »

పంచారామక్షేత్రానికి పోటెత్తిన భక్తులు

భీమవరం: మహా శివరాత్రి సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పంచారామక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. భక్తులు స్వామివారికి పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Read More »

ఉద్యోగం పేరుతో మోసం…

ప.గో: ఉద్యోగాల పేరుతో మస్కట్‌కు వెళ్లిన 20 మంది ఉభయగోదావరి జిల్లా మహిళలు తీవ్ర కష్టాలు ఎదుర్కుంటున్నారు. కువైట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఏజెంట్ తమను మోసం చేశాడంటూ మహిళలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమను స్వదేశానికి రప్పించేలా చొరవ చూపాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తనను రక్షించాలంటూ ఉండి గ్రామంలోని తన భర్త శ్రీనివాస్‌కు భార్య లలిత వీడియోలు పంపింది. దీంతో ఉండి పోలీస్‌స్టేషన్లో భర్త ఫిర్యాదు చేశారు.

Read More »

పశ్చిమ గోదావరిలో చేతబడి కలకలం

పశ్చిమ గోదావరి: జిల్లాలోని కొయ్యలగూడెం మండలం ఆరిపాటి దిబ్బలులో చేతబడి కలకలం రేపుతోంది. ఓ మహిళ చేతబడి చేస్తూ జామాయిల్‌ తోటలో దున్నపోతును బలి ఇచ్చినట్లు ఆనవాళ్లు కనిపించాయి. ఒక బాలుడి బొమ్మని చిత్రీకరించి దాని ముందు గొయ్యి తవ్వి నిమ్మకాయలు, కుంకుమ, పసుపుతో క్షుద్రపూజలు చేశారు. దీంతో తీవ్ర భయభ్రాంతులకు గురైన గ్రామస్తులు గత మూడు రోజులుగా నిద్రాహారాలు లేకుండా గడుపుతున్నారు. క్షుద్రపూజలు చేసినట్లు భావిస్తున్న మహిళకు గ్రామస్తులు …

Read More »

నేడు భీమవరానికి రానున్న సీఎం జగన్‌..

ఏలూరు (మెట్రో): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏలూరులో గురువారం పర్యటించనున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు మనవడి వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం జిల్లాకు రానున్నారు. గురువారం సాయంత్రం 3.40 గంటలకు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసం నుంచి బయలుదేరిహెలీకాప్టర్‌ ద్వారా 4.25 గంటలకు భీమవరంలోని వీఎస్‌ఎస్‌ గార్డెన్‌కు చేరకుంటారు. 4.35 గంటలకు వీఎస్‌ఎస్‌ గార్డెన్‌లో జరిగే మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు మనవడి వివాహానికి హాజరవుతారు. 4.55 …

Read More »

పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం..

పశ్చిమ గోదావరి: జంగారెడ్డిగూడెం శ్రీనివాసపురం రోడ్డులో పాదచారిని మోటార్ సైకిల్ ఢీకొంది. ఈ ఘటనలో పాదాచారితో బైక్‌పై ఉన్న వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.  మెరుగైన వైద్యం కోసం అతడిని ఏలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Read More »

పోకిరిని పట్టించిన దిశ యాప్

ఏపీలో దిశ యాప్ మహిళను వేధిస్తున్న ఓ పోకిరిని పట్టించింది. విశాఖ నుంచి విజయవాడ వెళ్తుండగా ఏలూరు సమీపంలో బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ పట్ల.. వెనుక సీట్లో ఉన్న వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో దిశ యాప్ ద్వారా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. 7 నిమిషాల వ్యవధిలో లొకేషన్ ఆధారంగా బస్సు వద్దకు చేరుకున్న ఏలూరు పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకోగా, తెల్లవారుజామున 4 గంటల సమయంలో …

Read More »