Breaking News
Home / States / Andhra Pradesh / YSR Kadapa

YSR Kadapa

స్కూటీని ఢీకొన్న గుర్తుతెలియని వాహనం…వ్యక్తి మృతి

గోపవరం: వైఎస్ఆర్ జిల్లా గోపవరం మండలం ద్వారకా కన్సెక్షన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్కూటీని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు నెల్లూరు జిల్లా కదిరినాయుడు పల్లెకు చెందిన బసిరెడ్డి నాగిరెడ్డిగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Read More »

రోడ్డుపై చిరుత చివరి క్షణాలు

నెల్లూరు జిల్లా మర్రిపాడులో రోడ్డుపై చిరుత చివరి క్షణాలు.. చిరుత గాయపడి జనం చూస్తుండగానే చనిపోయింది.. కడప : ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చిరుత తీవ్రంగా గాయపడింది. రోడ్డుమీదే కాసేపు ప్రాణంతో పోరాటంచేసింది. చివరకు చనిపోయింది. ఉదయగిరి కొండల్లో అడవిలోంచి జాతీయ రహదారిపైకి వచ్చిన పులి రోడ్డు దాటుతుండగా ఏదో వాహనం కొట్టేసింది.  

Read More »

పులివెందులలో వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం

పులివెందుల: పులివెందుల్లో ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఘనస్వాగతం లభించింది. పులివెందుల పట్టణంలోని ప్రధాన వీధులన్నీ జనసంద్రాన్ని తలపించాయి. శనివారం ఉదయం 8 గంటలకు జగన్‌ ఇంటి వద్ద నుంచి సీ ఎస్‌ఐ చర్చిలో ప్రార్థనలు చేసేందుకు ఆయన, మాజీ ఎంపీ వైఎస్‌ అవినా‌ష్‌రెడ్డి బయలుదేరారు. అక్కడి నుంచి వైసీపీ అభిమానులు, నాయకులు, ప్రజలు పెద్దఎత్తున జగన్‌కు స్వాగతం పలికారు. కడప రోడ్డులోకి జగన్‌ రాకతో అక్కడున్న …

Read More »

బాకీ ఇవ్వలేదని ఇల్లు కూల్చేయత్నం

కడప: కడప తాలుకా పోలీసుస్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి ఇచ్చిన బాకీ తీర్చలేదంటూ కొందరు శనివారం ఆయన ఇంటిని కూల్చేయత్నం చేశారు. కాగా ఈ సంఘటనపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేర.. బాకీ పడ్డ వ్యక్తి చెప్పిన గడువుకు డబ్బు ఇవ్వలేకపోయాడు. తరచూ అడుగుతున్నా స్పందించలేదు. అయితే వడ్డీ రూపంలో పెద్దగా చెల్లించినట్లు, అసలు తీర్చేందుకు సమయం కావాలని అడిగినా అప్పు …

Read More »

కడప జైలుకు తాడిపత్రి మట్కా కేడీలు

పోలీసులపై దాడి చేసిన రషీద్‌ సహా 12 మంది తరలింపు పీటి వారెంట్‌పై కడపకు తరలింపు కడప: కడప పోలీసులపై దాడి చేసి తీవ్రంగా గాయపరచి, వాహనాన్ని దగ్ధం చేసిన తాడిపత్రి మట్కా కేడీలను శనివారం ప్రొడ్యూస్డ్‌ ఫర్‌ ట్రయల్స్‌ (పిటి) వారెంట్‌ పై కడప కేంద్ర కారాగారానికి తరలించారు. ప్రధాన నిందితుడు రషీద్‌ సహా 12 మందిని జైలుకు పంపారు. విధుల నిమిత్తం వెళ్లిన పో లీసులపై దాడులు …

Read More »

నేడు పులివెందులలో జగన్ పర్యటన

కడప: ప్రజాసంకల్ప యాత్ర ముగిసిన అనంతరం తొలిసారి జిల్లాకు చేరుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సీఎస్‌ఐ చర్చిలో నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొననున్నారు. అనంతరం గండి ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆపై ఇడుపులపాయ వైఎస్సార్‌ ఘాట్‌లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి జగన్ నివాళులర్పించనున్నారు.

Read More »

7 లారీల గ్రానైట్ బ్లాకులను సీజ్………

కడప జిల్లా: జిల్లాలోని బద్వేలు పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న గ్రానైట్ బ్లాకుల లారీలను పట్టుకున్న విజిలెన్స్ అధికారులు… 7 లారీల గ్రానైట్ బ్లాకులను సీజ్ చేసి 10 లక్షల రూపాయల పినాల్టీ విధించిన విజిలెన్స్ అధికారులు….

Read More »

కేరళలో అయ్యప్పల వాహనానికి ప్రమాదం…కడప వాసి మృతి

చిన్నార్సుపల్లె: కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప జిల్లాకు చెందిన అయ్యప్ప భక్తుడు మృతి చెందాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. చిన్నమండెం మండలంలో చిన్నార్సుపల్లెకు చెందిన కొందరు అయ్యప్ప స్వాములు రెండు వాహనాలలో శబరిమలైకు వెళ్లారు. కాగా ఇందులో ఒక వాహనం అదుపుతప్పి లోయలో పడినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన వల్లపు కృష్ణ(30) అక్కడికక్కడే మృతి చెందగా గోపాల్, వెంకటమ్మ, కృష్ణ, కారు డ్రైవర్ …

Read More »

సోదరుడి ఇంటి ఎదుట వైఎస్‌ వివేకా బైఠాయింపు

పులివెందుల: వైసీపీ నేత వైఎస్‌ వివేకానందరెడ్డి తన సోదరుడు వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి ఇంటి ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. కడప జిల్లా పులివెందులలో సోమవారం జరిగిన ఈ సంఘటన వివరాల్లోకెళితే.. వివేకానందరెడ్డి అనుచరుడు రవీంద్రనాథరెడ్డి, వివేకానందరెడ్డి చిన్నాన్న కొడుకు వైఎస్‌ ప్రతా్‌పరెడ్డి బావమరిది రాజశేఖర్‌రెడ్డి చిత్తూరు జిల్లా కుప్పం వద్ద గ్రానైట్‌ క్వారీని భాగస్వామ్యంతో లీజుకు తీసుకున్నారు. ఈ క్వారీ దాదాపు రూ.600 కోట్ల విలువ చేస్తుందని అంచనా. 2008లో …

Read More »

కడప జిల్లాలో కాషాయం వెలిగిపోతోంది..!

మేరా బూత్‌ సబ్‌సే మజ్‌బూత్‌లో ప్రధాని మోదీ కడప జిల్లాను అన్ని విధాలా ఆదుకోండి : కందుల కడప : పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. ఈ హాలు మొత్తం కాషాయం కండువా, టోపీలతో నిండిపోవడమే నిదర్శనం. బొట్టు బొట్టు నీరు సముద్రంలా మారినట్లు బూత్‌ బూత్‌లో ఆధిక్యం వచ్చేలా ముందుకు కదలాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం కడప నగరంలోని ఎస్‌ఎల్‌ఎన్‌ కల్యాణ మండపంలో మేరాబూత్‌ …

Read More »