Breaking News
Home / States / Telangana

Telangana

సిద్దిపేటను ఎడ్యుకేషన్‌ హబ్‌గా చేస్తా..

సిద్దిపేట జోన్‌: ‘నియోజకవర్గంలోని ప్రతీ విద్యార్థికి కార్పొరేట్‌ స్థాయి విద్య అందించడమే నా లక్ష్యం. గడిచిన నాలుగున్నరేండ్లలో సిద్దిపేటను ఎడ్యుకేషనల్‌ హాబ్‌గా మార్చే ప్రయత్నం చేశాను. వైద్య కళాశాల కల సాకారం కావడం నా రాజకీయ జీవితంలో ఒక గొప్ప అనుభూతి. నియోజవర్గంలోని ప్రతీ మండలంలో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. సిద్దిపేటలో పీజీ, డిగ్రీ కళాశాలలతో పాటు పాలిటెక్నిక్, వెటర్నరీ కళాశాలలు, మైనార్టీ గురుకులాలు, …

Read More »

హుజూర్‌నగర్‌‌లో ఉత్తమ్‌ నామినేషన్‌

హుజూర్‌నగర్‌: హుజూర్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్ ప్రత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. నామినేషన్ కార్యక్రమంలో పద్మావతిరెడ్డి, మహాకూటమి నేతలు పాల్గొన్నారు. మొత్తం 119 స్థానల్లో 25 సీట్లను మిత్రపక్షాలకు కాంగ్రెస్. పంచింది. ఈ ఎన్నికల్లో 94 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పటి వరకు రెండు విడతల్లో 75 మంది అభ్యర్థులను ప్రకటించింది. కొన్ని చోట్ల అసంతృప్తుల జ్వాల రగిలింది. మరోవైపు టీజేఎస్ కొన్ని స్థానాల …

Read More »

గాంధీభవన్ ఎదుట యాదవ సంఘాల ఆందోళన

హైదరాబాద్: కాంగ్రెస్ మూడో జాబితా విడుదలయ్యాక మరోసారి గాంధీభవన్‌ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. తెలంగాణ యాదవ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గేట్లు ఎక్కి దూకేందుకు యత్నించారు. యాదవ సామాజిక వర్గానికి  అన్యాయం జరిగిందని వారు ఆరోపించారు. ఉత్తమ్‌ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పొత్తులో భాగంగా ముఖ్యమైన సీట్లను ఇతర పార్టీలకు ఇచ్చారని వారు మండిపడ్డారు.

Read More »

కాంగ్రెస్ మూడో జాబితా విడుదల.. కీలక నేతలకు షాక్

హైదరాబాద్: తెలంగాణలో డిసెంబర్ 7న జరగబోయే ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేసిన కాంగ్రెస్ తాజాగా 13మంది అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. కాగా కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి సీటు ఆశించిన సనత్‌నగర్ స్థానానికి టీ టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో మర్రి వర్గం తీవ్ర అసంతృప్తికి లోనైంది. ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా కూన వెంకటేష్ …

Read More »

4‘కె’లతో 4 కోట్ల మందికి ఇబ్బంది: ఖుష్బూ

జడ్చర్ల: రాష్ట్రంలో 4‘కె’ల(కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత, కుటుంబం)తో 4 కోట్ల మంది ఇబ్బందులు పడుతున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి, సినీ నటి ఖుష్బూ ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలోని మల్లు రవి నివాసంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్‌ కుటుంబ సభ్యుల గుప్పిట్లోనే రాష్ట్ర పాలన సాగుతోందని ఆరోపించారు. సచివాలయానికి రాకుండా పరిపాలన సాగించిన ఏకైక సీఎం కేసీఆర్‌ అని విమర్శించారు. చైల్డ్‌ అండ్‌ ఉమెన్‌ …

Read More »

సీబీఐలో సంక్షోభం వల్లే అలా చేశాం: యనమల

అమరావతి: సీబీఐలో నెలకొన్న సంక్షోభం వల్లే ఏపీలో ‘సాధారణ సమ్మతి’ని ఉపసంహరించామని మంత్రి యనమల రామకృష్ణుడు వివరించారు. శనివారం మీడియాతో రాజకీయ కక్ష సాధింపులకు సీబీఐ సాధనం కారాదన్నారు. రాష్ట్రంలోకి సీబీఐ ప్రవేశానికి సమ్మతి ఉపసంహరణ సబబే అని మంత్రి చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి ఉన్న అధికారం ప్రకారమే చేశామని తెలిపారు. ఏపీ స్ఫూర్తితో మిగిలిన రాష్ట్రాలూ అదే నిర్ణయం తీసుకోవాలని యనమల కోరారు. సమాఖ్య స్ఫూర్తిని కాపాడేందుకే ఈ జీవో …

Read More »

తాత, తండ్రి ఆశీస్సులు తీసుకున్న సుహాసిని

హైదరాబాద్: కాసేపట్లో కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న నందమూరి సుహాసిని దివంగత నేతలైన తన తాత, తండ్రి ఆశీస్సులను తీసుకున్నారు. మహాప్రస్థానంలో తండ్రి హరికృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సుహాసిని వెంట ఆమె మామ చుండ్రు శ్రీహరి, పలువురు కుటుంబసభ్యులు ఉన్నారు. అంతకుముందు ఎన్టీఆర్ ఘాట్‌లో బాబాయ్ బాలయ్యతో కలిసి సుహాసిని పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. ఉదయం 11:21 గంటలకు కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా సుహాసిని నామినేషన్ …

Read More »

ప్రజలే దేవుళ్లు సమాజమే దేవాలయం

తమ సోదరి నందమూరి సుహాసినికి శుభాకాంక్షలు చెబుతూ యంగ్ టైగర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ ట్వీట్ చేశారు. ‘‘ప్రజలే దేవుళ్లు సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో తాతగారు స్వర్గీయ నందమూరి తారక రామారావుగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ మాకు ఎంతో పవిత్రమైనది. మా నాన్నగారు స్వర్గీయ నందమూరి హరికృష్ణగారు సేవలందించిన తెలుగుదేశం పార్టీ తరుపున ఇప్పుడు మా సోదరి సుహాసిని గారు కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి మీకు …

Read More »

జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంపై స్పందించిన బాలయ్య

హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని నేడు 11:21 గంటలకు నామినేషన్ వేయబోతున్నారు. ముందుగా నందమూరి ఫ్యామిలీతో కలిసి వెళ్లి దివంగత నేత ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. సమయాన్ని బట్టి, షెడ్యూల్ ప్రకారం వారు ప్రచారం చేస్తారన్నారు. ప్రజాకూటమి తరఫున ప్రచారం చేస్తానని చెప్పారు. సుహాసినిని భారీ …

Read More »

ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన సుహాసిని

హైదరాబాద్: కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న నందమూరి సుహాసిని నెక్లస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. సుహాసినితో పాటు నందమూరి బాలకృష్ణ, చుండు శ్రీహరి, పలువురు కుటుంబసభ్యులు ఎన్టీఆర్‌కు నివాళలర్పించారు. ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ ఎన్టీఆర్‌, చంద్రబాబు, హరికృష్ణ, బాలకృష్ణ ఆశీస్సులతో ప్రజాసేవ చేయడానికి ముందడుగు వేస్తున్నానన్నారు. అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని తెలిపారు. కూకట్‌పల్లిలో తన గెలుపు ఖాయమని నందమూరి సుహాసిని ధీమా …

Read More »