Breaking News
Home / Stories

Stories

మనిషిని చంపే ఆక్టోపస్‌ల గురించి తెలుసా?…

ప్రపంచంలో మనతో పాటు ఎన్నో రకాల జీవులు కూడా భూమి మీద జీవిస్తున్నాయి. ఇతర జీవులతో పోలిస్తే ఆక్టోపస్‌లు విభిన్నంగా ఉంటాయి. సముద్రంలో నివసించే ఈ జీవులు పరిసరాలకు తగ్గట్లు రంగులు మార్చుకుంటూ ఉంటాయి. మనం దాడి చేయాలని చూస్తే ఒక రసాయనాన్ని చిమ్ముతాయి. అయితే ఆక్టోపస్‌లన్నీ ప్రమాదకరం కాదు. మనిషిని చంపే ఆక్టోపస్‌లు కొన్ని ఉన్నాయి. వాటి గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి.

Read More »

పిల్లలకు పొదుపు ఎలా చేయాలో నేర్పించండి…

కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల చేత అతిగా ఖర్చు చేయిస్తుంటారు. పేరెంట్స్ కూడా పిల్లలు అడిగారు కదా అని అవసరం లేకున్నా కొనిస్తూ ఉంటారు. అయితే ఇక్కడే పేరెంట్స్ తప్పు చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు ఏది అడిగితే అది కొనివ్వడం వల్ల వారికి పొదుపు ఎలా తెలుస్తుందని ప్రశ్నిస్తున్నారు. అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు చేయడం, మనీ పొదుపు చేయడం పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పిస్తే మంచిదని సూచిస్తున్నారు.

Read More »

మీ జీవితంలో ఇదో మామూలు రోజు కాదు

రోజూలా జీవితంలో ఇదో రోజు, అలా గడిచిపోతుంది అంతకు మించి ఏముంది అనుకుంటే మీరు ఎప్పటికీ ఇలానే ఉంటారు. కానీ అలా కాకుండా ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలనే తపన ఉంటే మాత్రం మార్పు కనిపిస్తుంది. పది మందిలో ఒకడిలా బ్రతికేస్తే ఎప్పటికీ నీకంటూ గుర్తింపు ఉండదు. అదే నీ ఉనికి అందరికీ తెలిసేలా సింహంలా బ్రతికితే అందరూ గుర్తిస్తారు. కాబట్టి ‘ఈరోజును మామూలు రోజు’గా కాకుండా ‘మార్పు తెచ్చే …

Read More »

నేటి మహిళలకు ఆమె స్పూర్తి…

చిన్నతనం నుంచి ఆమె చదువులో చురుకుగా ఉన్నారు. చదువుకునే రోజుల్లో ఈవ్ టీజింగ్ ను ఎదుర్కొంది. కానీ అప్పుడు ఏం చేయలేక పోయింది. ప్రజా సేవ చేయాలనే సంకల్పంతో సివిల్స్ కు ప్రిపేర్ అయ్యి రెండో ప్రయత్నంలో ఆమె ఐఏఎస్ గా ఎంపికైంది. పలు ప్రదేశాల్లో పని చేసి మంచి పేరు సంపాదించింది. సీఎం జగన్ మెప్పు పొంది ఏపీ సర్కార్ దిశ చట్టం-2019 కి ప్రత్యేకాధికారిగా నియమితులయ్యారు. నాడు …

Read More »

నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వు..!

తన పేరు బుజ్జి నా జూనియర్. హ్యాపిడేస్‌ సినిమాలో లాగా తనని మొదటిసారి చూడగానే ప్రేమించాను. వెంటనే తనకి చెప్పాను. మా ఇంట్లో ఇలాంటివి ఒప్పుకోరు. నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని చెప్పింది. కానీ నేను మాత్రం తనని వదులుకోలేకపోయాను. నా చదువు పూర్తవగానే జాబ్‌లో జాయిన్‌ అయ్యాను. అలా ఒక సంవత్సరం గడిచిపోయింది. ఒకరోజు తన నుంచి కాల్‌ వచ్చింది. ఓ ప్రాజెక్ట్‌లో హెల్ప్‌ కావాలి అని. …

Read More »

అమెరికా ప్రథమ మహిళల సందర్శన

స్త్రీ పక్కన ఉంటే పురుషుడికి లభించే గౌరవమే వేరు! సీఎం అయినా, పీఎం అయినా, చక్రవర్తే అయినా. అంతవరకు ఎందుకు.. మనం వెళ్లే ఫంక్షన్‌లలోనే చూడండి.. అతను కనిపించి ఆమె జాడ లేకుంటే… ఠపీమని ‘అమ్మాయేదీ!’ అంటారు. ‘మేడమ్‌ ఎక్కడా!!’ అని చుట్టుపక్కలకు చూస్తారు. అమెరికా అధ్యక్షుడు కొద్ది గంటల్లో ఇండియాలో దిగుతున్నారు. ఆయనకు ఉండే గౌరవం ఆయనకు ఉంటుంది. సతీమణితో పాటు వస్తున్నారు కనుక సంపూర్ణ గౌరవం ఉంటుంది. …

Read More »

ఆ బియ్యమే నా బిజినెస్‌ కెరీర్‌కు పూజాక్షతలు

‘‘కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు బియ్యం లేని భోజనమే లేదు. అందుకే బియ్యం వ్యాపారాన్ని మొదలు పెట్టాను. పిడికెడు బియ్యం మనిషి మనుగడకు భరోసా.ఆ బియ్యమే నా బిజినెస్‌ కెరీర్‌కు పూజాక్షతలు’’ అంటోంది మణిపురి యువతి ముదిత. నిజమే! ముదిత అన్నట్లు కశ్మీరీ పులావ్, బిర్యానీలతో ఉత్తరాది విందులో అగ్రస్థానం బియ్యానిదే. దక్షిణాది రాష్ట్రాల్లో అయితే ఇడ్లీ, దోసెల రూపంలో తెల్లవారేదే బియ్యంతో. అయితే ఇప్పుడు టెక్‌ ఇండియా బియ్యానికి …

Read More »

ఆ కళ్లు నా కోసం బాధపడుతున్నాయి…

నేను తొమ్మిదవ తరగతి చదువుతున్న రోజుల్లో మా ఇంటి పక్క ఇంట్లో ఓ అమ్మాయి ఉండేది. తను ఏడవ తరగతి చదువుతుండేది. ఒకే ఊరు కనుక కలిసి ఆడుకుంటూ ఎప్పుడూ సరదాగా ఉండేవాళ్లం. నేను మా ఇంట్లో అమ్మకు సహాయం చేసే వాడిని, తను నాకు సహాయం చేసేది. అలా మా మధ్య ఇష్టం చాలా పెరిగింది. తనెప్పుడూ నా కోసమే ఆలోచించేది. తనంటే ఇష్టంగా ఉండేవాడిని కానీ, ప్రేమ …

Read More »

నేను ఉంటే జాబ్ తెచ్చుకోలేవా…?

కాలేజీకి వెళ్లి చదువు కోవడం.. ఇంట్లో పని చేయడం తప్ప ఏమీ తెలియని నా జీవితంలోకి అనుకోకుండా ఓ అమ్మాయి వచ్చింది. ఎప్పుడూ గొడవపడే మేము ఫ్రెండ్స్‌గా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. నేను ఏ అమ్మాయి గురించి మాట్లాడినా గొడవ పడేది. అప్పుడే అర్థం అయింది.. తను నన్ను ప్రేమిస్తోందని. తన పుట్టినరోజుకు ముందు రోజు నాకు ప్రపోజ్‌ చేసింది. అప్పుడు నాకు పెద్దగా ఏమీ అనిపించలేదు కానీ, …

Read More »

ప్రతి విషయం మరో విషయంతో ముడిపడి ఉంటుందేమో!…

నేను బీటెక్‌ చేశాను. కానీ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ లేక నాకు సరియైన జాబ్‌ రాలేదు. ఏదో చిన్న జాబ్‌లో చేరాను. బాగా చదివి టాప్‌లో ఉండే నాకు సరిగా మాట్లాడలేకపోవడం, ఇంగ్లీష్‌ రాకపోవడం వల్ల మంచి జాబ్‌లో చేరలేకపోయాను. ఆ బాధ నన్ను చాలా వెంటాడుతూ ఉండేది. ఎందుకు ఈ జాబ్‌ చేస్తున్నానో కూడా అర్థం అయ్యేది కాదు. చాలా డిప్రెషన్‌లో ఉండే వాడిని. నవ్వి కూడా చాలా రోజులు …

Read More »