Breaking News
Home / Uncategorized

Uncategorized

ఘోర రోడ్డు ప్రమాదం; ఐదుగురి మృతి

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్‌ జిల్లా పఠా రోడ్‌ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి ఆగ్రాకు మామిడిపళ్ల లోడుతో వెళుతున్న ట్రక్‌ పఠారోడ్‌ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు మృతి చెందగా, 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ట్రక్కులో 16 మంది ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

Read More »

ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల చేరువలో కరోనా కేసులు…

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలు వైరస్‌తో విలవిల్లాడుతున్నాయి. ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 40 లక్షల చేరువలో ఉన్నాయి. 13 లక్షల మందికిపైగా వ్యాధిబారి నుంచి కోలుకున్నారు. అమెరికా, రష్యా, బ్రెజిల్ దేశాల్లో వైరస్ వ్యాప్తి అంతకంతకు పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం గత 24 గంటల్లో మొత్తం 39,17,532 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. …

Read More »

ధర తగ్గిన ఉల్లి, టమాట

మెదక్/తూప్రాన్‌: మొన్నటి వరకు భగ్గుమన్న ఉల్లి, టమాట ధరలు తగ్గుముఖం పట్టాయి. లాక్‌డౌన్‌ ప్రకటించిన మొదట్లో కిలో టమాట రూ.50, ఉల్లి రూ.150, పచ్చిమిర్చి కిలో రూ.80 వరకు పలికింది. కొన్ని రోజుల నుంచి వీటి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. హోల్‌సెల్‌ మార్కెట్‌లో 25 కిలోల టమాట బాక్సు రూ.30, రిటైల్‌ మార్కెట్‌లో 3కిలోలు రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. బయట రూ.3కు కిలో చొప్పున అమ్ముతున్నారు. ఉల్లిగడ్డ రిటైల్‌లో కిలో …

Read More »

ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం…

న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ని కట్టడి చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆరోగ్య సేతు యాప్‌’ను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరు తమ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదుల శాఖ బుధవారం నాడు పిలుపునిచ్చింది. ఆరోగ్య సేతు అనేది ‘కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ మొబైల్‌ అప్లికేషన్‌’. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న వ్యక్తి ఎవరినయితే కలుసుకోబుతున్నారో, వారికి కరోనా వైరస్‌ సోకిందా, లేదా అన్న …

Read More »

చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్నదానం

జగిత్యాల: నేడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు. ఆయన జన్మదినాన్ని టీడీపీ నేతలు, కార్యకర్తలు పలు స్వచ్ఛంద కార్యక్రమాల ద్వారా నిర్వహిస్తున్నారు. కాగా.. జగిత్యాల టీడీపీ నేతలు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా స్థానిక బీహార్ వలస కూలీలకు అన్నదానం చేశారు.

Read More »

క్రెడిట్ కార్డు బిల్లు కట్టనవసరం లేదు

కరోనా ప్రభావం క్రమంలో అన్ని రకాల లోన్ల ఏంఈపై 3 నెలల పాటు మారటోరియం విధించినట్లు ఱ్భీ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన తర్వాత ఇందులోకి క్రెడిట్ కార్డు బిల్లులు కూడా వస్తాయా? లేదా? అనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో క్రెడిట్ కార్డు బిల్లులపై RBI స్పష్టత ఇచ్చింది. క్రెడిట్ కార్డు బిల్లులకు కూడా ఈఎంఐ మారటోరియం రూల్స్ వర్తిస్తాయంది. దీంతో ఈ మూడు …

Read More »

బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త…

దేశంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఏటీఎం వినియోగదారులకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త తెలిపారు. డెబిట్ కార్డు వినియోగదారులు రానున్న ముూడు నెలలపాటు ఉచితంగా అన్ని బ్యాంకుల ఏటీఎంలలో ఎన్నిసార్లైనా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చని ప్రకటించారు. ఇక అన్ని బ్యాంకుల సేవింగ్స్ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు నిర్మలా స్పష్టం చేశారు.

Read More »

ఒలింపిక్స్‌ను బహిష్కరించిన ఆస్ట్రేలియా…

కరోనా వైరస్ నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ నిర్వహణపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటికే తమ అథ్లెట్లను ఒలింపిక్స్‌కు పంపమని కెనడా తేల్చిచెప్పగా.. తాజాగా ఆస్ట్రేలియా కూడా ఇదే నిర్ణయం ప్రకటించింది. వైరస్ దృష్ట్యా తమ అథ్లెట్ల బృందాలను టోక్యోకు పంపించలేమని స్పష్టంచేసింది. దీంతో మరిన్ని దేశాలు ఒలింపిక్స్‌ను బహిష్కరించే అవకాశాలు ఉన్నాయి. కాగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 14వేల మందికి పైగా చనిపోయారు.

Read More »

ఒక్కరోజులో 11,500 మందికి కరోనా…

జెనీవా (స్విట్జర్లాండ్): కరోనా వైరస్ వ్యాప్తి, మృతుల సంఖ్యపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రపంచ ప్రజలను నివ్వెర పర్చింది. ప్రపంచవ్యాప్తంగా ఒక్క మంగళవారం రోజే 11,500 మంది రోగులు కరోనా వైరస్ బారిన పడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మంగళవారం నాటికి ప్రపంచంలో కొవిడ్-19 పాజిటివ్ రోగుల సంఖ్య 1,79,000 మందికి చేరిందని నిర్ధారించింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో మంగళవారం ఒక్క రోజే …

Read More »

ఇండియా పర్యటన రద్దు చేసుకున్న రష్యా ప్రధాని…

న్యూఢిల్లీ: భారత పర్యటనకు రావాల్సిన రష్యా ఉప ప్రధానమంత్రి టాట్యన గోలికోవ యూటర్న్ తీసుకున్నారు. మార్చి చివరి వారానికి తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఇండియాలో ప్రస్తుతం కోవిడ్-19 (కరోనా) విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దూర ప్రాంత రవాణాను పబ్లిక్ ప్రదేశాలను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. కొన్ని దేశాల నుంచి రవాణా సౌకర్యాన్ని కొంత కాలంపాటు పూర్తి రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఇండియా పర్యటన చేయలేమని గోలికోవ …

Read More »