Breaking News
Home / World News

World News

లక్షణాలు లేకుండా కరోనా వ్యాపిస్తోంది…

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరో షాకింగ్ వార్త వినిపించింది. ప్రస్తుతం కరోనా లక్షణాలు ఏవీ కనిపించకుండానే వైరస్ వ్యాపిస్తోందని.. మూడు రోజుల తర్వాత రోగుల్లో లక్షణాలు బయటకు కనిపిస్తున్నాయని హెచ్చరించింది. దీంతో అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని.. కరోనా రోగిని గుర్తించేందుకు వీలైనన్ని మార్గాలను అన్వేషించాలని హితవు పలికింది.

Read More »

బ్రిటన్ ప్రధాని ఆరోగ్యంగానే ఉన్నారు…

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్యంపై అక్కడి అధికారులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం జాన్సన్ ఆరోగ్యంగానే ఉన్నారని, వెంటిలేటర్‌పై లేరని స్పష్టం చేశారు. ఐసీయూలో వైద్యులు ఆయనకు ఆక్సిజన్ మాత్రమే అందిస్తూ చికిత్స చేస్తున్నారని తెలిపారు. కాగా కరోనా పాజిటివ్ రావడంతో వారం రోజులుగా స్వీయ నిర్బంధంలో ఉన్న ఆయనకు కరోనా లక్షణాలు తగ్గకపోవడంతో ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే.

Read More »

మెడిసిన్ పంపకపోతే ఇండియాపై ప్రతీకారం…

అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. హైడ్రాక్సిక్లోరోక్వీన్ మెడిసిన్‌ను భారత్ పంపని పక్షంలో ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. తాను మోదీతో మాట్లాడానని.. మోదీ అందుకు అనుకూలంగానే ఉన్నారని, భారత్ ఆ మందులను పంపుతుందని తాను అనుకుంటున్నట్లు తెలిపారు. ఒకవేళ హైడ్రాక్సిక్లోరోక్వీన్ మందులను పంపని పక్షంలో భారత్‌పై ప్రతీకారం తీర్చుకునే అవకాశముందని హెచ్చరించారు.

Read More »

ఏప్రిల్ నెలాఖరుకు కరోనా కేసులు తగ్గుదల

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఏప్రిల్ చివరి నాటికి తగ్గిపోతాయని చైనా శాస్త్రవేత్త ఝాంగ్ నన్షాన్ తెలిపారు. చైనా, ఇటలీలో కరోనా కేసుల తగ్గుదల కనిపిస్తోందని.. అమెరికా, ఇండియాలో కూడా కరోనా కేసుల సంఖ్య ఏప్రిల్ చివరికల్లా తగ్గే అవకాశాలున్నాయన్నారు. ప్రపంచదేశాలు చేపట్టిన లాక్‌డౌన్ వైరస్‌పై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో బలహీనం అవుతోందంటూ పేర్కొన్నారు. త్వరలోనే వైరస్ పూర్తిగా పోయే రోజులు చూస్తామని చెప్పారు.

Read More »

డాక్టర్‌గా మారిన ఐర్లాండ్ ప్రధాని…

కరోనాను కట్టడికి వాలంటీర్లు, రిటైర్డు డాక్టర్లు, నర్సుల కోసం ఐర్లాండ్ ప్రభుత్వం రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించింది. ఇందుకోసం దాదాపు 60 వేల మంది స్పందించి ముందుకొచ్చారు. అయితే ఈ లిస్ట్‌లో ఆ దేశ ప్రధాని లియో వరద్కర్ పేరూ ఉంది. 2003లో మెడిసిన్‌లో పట్టా పొందిన ఈయన.. అనతి కాలంలోనే ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారు. కరోనా నేపథ్యంలో ప్రధాని డాక్టర్‌గా డ్యూటీ చేసేందుకు ముందుకొచ్చారని అధికారులు తెలిపారు.

Read More »

ఆస్పత్రిలో చేరిన బ్రిటన్‌ ప్రధాని…

లండన్‌ : కరోనా వైరస్‌ సోకిన బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌(55)ను ఆదివారం ఆసుపత్రికి తరలించారు. గత ఏడు రోజులుగా ఆయన క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నప్పటికీ.. ఇంకా కొన్ని వైరస్‌ లక్షణాలు ఉన్నాయని అందుకే ఆయనను ఆస్పత్రికి తరలించామని అధికారులు వెల్లడించారు. స్వీయ నిర్భందంలో ఉన్న బోరిస్‌ గత శుక్రవారమే బయటకు రావాల్సింది. కానీ తీవ్రమైన జ్వరం ఉండడంతో ఆదివారం వరకు క్వారంటైన్‌లో ఉన్నారు. కోవిడ్‌ లక్షణాలు తగ్గకపోవడంతో.. …

Read More »

జూపార్కులోని పులికి కరోనా వైరస్…ఫస్ట్ కేసు

న్యూయార్క్ (అమెరికా): ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మొట్టమొదటిసారి నాలుగేళ్ల పులికి సోకింది. అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలోని బ్రోంక్స్ జంతుప్రదర్శనశాలకు చెందిన నాడియా అనే నాలుగేళ్ల వయసుగల పులికి కరోనా వైరస్ సోకిందని అమెరికా ఫెడరల్ అధికారులు ప్రకటించారు. జూపార్కు ఉద్యోగి నుంచి పులికి కరోనా వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు. బ్రోంక్స్ జూపార్కులో నాడియాతోపాటు మరో ఆరు పులులు, సింహాలు అనారోగ్యానికి గురయ్యాయి. దీంతో పరీక్షలు చేయగా …

Read More »

ప్రజలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పాక్ ప్రధాని!

ఖాన్ దేశ ప్రజలను హెచ్చరించారు. పంజాబ్ ప్రావిన్స్‌లో వెయ్యికి పైగా కరోనా కేసుల నమోదైన నేపథ్యంలో ఇమ్రాన్ ఆ ప్రాంతంలో పర్యటించారు. కరోనా కట్టడి కోసం అక్కడి అధికారుల చేపడుతున్న పరిశీలన అనంతరం.. అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కరోనా ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఇమ్రాన్.. కరోనా విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించవద్దంటూ ప్రజలను గట్టిగా హెచ్చరించారు. ‘కరోనా మాకు సోకదనే తప్పుడు అభిప్రాయం ఎవ్వరికీ ఉండకూడదు. …

Read More »

కరోనాకు విరుగుడుపై ముందడుగు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు విరుగుడు కనుగొనడంలో శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. అమెరికాలోని పిట్స్‌బర్గ్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన పరిశోధనల ద్వారా కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీలను ఎలుకల్లో వారు ఉత్పత్తి చేయగలిగారు. ఇది ప్రస్తుతం అందరికీ శుభవార్తే అయినా.. మనుషుల మీద ఈ తరహా ప్రయోగాలు చేసి, అందరికీ అందుబాటులో తేవడానికి మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశముంది.

Read More »

24 గంటల్లో 1500 మంది మృతి…

వాషింగ్టన్‌ : అగ్రరాజ్యంలో కరోనా వైరస్‌ తన ప్రతాపం చూపుతోంది. కరోనా మరణాల విషయంలో ఇతర దేశాలు అందుకోలేనంత ఎత్తులోకి అమెరికా చేరుకుంది. గురువారం-శుక్రవారం వరకు 24 గంటల సమయంలో ప్రపంచ రికార్డు స్థాయి మరణాలు సంభవించాయని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్శిటీ పేర్కొంది. దాదాపు 1,500 మంది కరోనా బాధితులు మృత్యువాత పడ్డారని వెల్లడించింది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 10 లక్షలకుపైగా కేసులు నమోదు కాగా, అమెరికాలో ఈ …

Read More »