వాషింగ్టన్: కరోనా విషయంలో అవసరమైతే చైనాతో అన్ని రకాల సంబంధాలను తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రసంగించిన ట్రంప్ ఈ విషయాన్ని వివరించారు. కరోనా వైరస్ ఇతర దేశాలకు వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడంలో చైనా పూర్తిగా విఫలమైందని, అందువల్లే ప్రపంచ దేశాలు ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఇన్నాళ్లూ …
Read More »అన్ని రకాల సంబంధాలను తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధం
వాషింగ్టన్: కరోనా విషయంలో అవసరమైతే చైనాతో అన్ని రకాల సంబంధాలను తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రసంగించిన ట్రంప్ ఈ విషయాన్ని వివరించారు. కరోనా వైరస్ ఇతర దేశాలకు వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడంలో చైనా పూర్తిగా విఫలమైందని, అందువల్లే ప్రపంచ దేశాలు ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఇన్నాళ్లూ …
Read More »మస్కట్ కీలక నిర్ణయం…
మస్కట్: మహమ్మారి కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో మస్కట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29 వరకు లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ అల్ సయ్యేది గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కోవిడ్-19 సుప్రీం కమిటీ సమావేశం అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రజలు సామాజిక దూరం పాటించకుండా సమూహంగా తిరగడం పట్ల ఈ సందర్భంగా సయ్యేది ఆగ్రహం వ్యక్తం …
Read More »వైద్య సిబ్బంది సేవలపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు….
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోవిడ్-19పై జరుగుతున్న పోరాటంలో డాక్టర్లు, నర్సులు మరణాన్ని సైతం లెక్కచేయకపోవడాన్ని అందమైన విషయంతో ఆయన పోల్చారు. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కోవిడ్ 19పై జరుగుతున్న పోరాటంలో వైద్య సిబ్బంది పాత్ర గురించి ట్రంప్ మాట్లాడారు. మృత్యువుకు భయపడకుండా వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారన్నారు. బుల్లెట్లకు సైనికులు ఎదురేగినట్టు డాక్టర్లు, నర్సులు …
Read More »భారత్ కు ఆర్థిక సాయం ప్రకటించిన ప్రపంచబ్యాంకు…
కరోనా కష్టకాలంలో ప్రపంచబ్యాంకు భారత్ కు శుభవార్త చెప్పింది. సామాజిక భద్రత ప్యాకేజి కింద భారత్ కు 1 బిలియన్ డాలర్లు (రూ.7,549 కోట్లు) ఆర్థిక సాయం చేస్తున్నట్టు ప్రకటించింది. భారత ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాల కోసం ఈ నిధులు ఇస్తున్నట్టు ప్రపంచబ్యాంకు వెల్లడించింది. ప్రపంచబ్యాంకు భారత్ తో మూడు రంగాల్లో భాగస్వామిగా ఉండనుంది. ఆరోగ్యం, సామాజిక భద్రత, సూక్ష్మ-చిన్న-మధ్య తరగతి పరిశ్రమల రంగంలో భారత్ కు దన్నుగా …
Read More »45లక్షలు దాటిన కరోనా కేసులు…
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలు వైరస్‌తో విలవిల్లాడుతున్నాయి. ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 45 లక్షలు దాటాయి. ఇప్పటి వరకు 17 లక్షల మందికిపైగా కరోనా వ్యాధిబారి నుంచి కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో మొత్తం 45,26,905 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,03,405 మంది మృతి …
Read More »తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయ ద్వారాలు…
డెహ్రాడూన్ : పవిత్ర పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయం తెరుచుకుంది. నేడు ఉదయం 4:30 నిమిషాలకు వేద మంత్రాలతో ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. అనంతరం ఆలయాన్ని పూలతో సుందరంగా అలంకరించి అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాన పూజారితో సహా మొత్తం 28 మంది మాత్రమే ఆలయం తలుపులు తెరుచుకున్నప్పుడు బద్రీనాథుని సన్నిధిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే కరోనా కారణంగా దేవాలయాలన్నీ మూతపడిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం పవిత్రక్షేత్రంలోకి …
Read More »ఒక్క రోజులో లక్ష కరోనా కేసులు…
అమెరికా, బ్రెజిల్, యూకేలో కరోనా వైరస్ చెలరేగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా నిన్న ఒక్క రోజే లక్ష కేసులు నమోదు కాగా, అమెరికాలో 26,398 కేసులు వెలుగుచూశాయి. బ్రెజిల్లో 13,761, రష్యాలో 9,974 కేసులు నమోదయ్యాయి. ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్‌లలో వందల సంఖ్యలోనే కేసులు నమోదయ్యాయి. భారత్‌లో నిన్న ఒక్క రోజే 3,942 మంది కరోనా బారినపడ్డారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 45 లక్షల మార్క్ దాటిపోయింది. మరోవైపు, …
Read More »డబ్ల్యూహెచ్ఓ తాజా హెచ్చరిక…
న్యూఢిల్లీ : కరోనా వైరస్ కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)మరో సంచలన హెచ్చరిక చేసింది. మహమ్మారి కరోనా హెచ్ఐవీ లాంటిదని ఎప్పటికీపోదని హెచ్చరించింది. ‘ప్రపంచం దానితో జీవించడం నేర్చుకోవలసి ఉంటుంది’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉన్నత నిపుణుడు హెచ్చరించారు. కరోనా వైరస్ ప్రపంచ సమాజంలో హెచ్ఐవీ లాంటి మరొక స్థానిక వైరస్ కావచ్చని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సోకుతున్న హెచ్ఐవీ మాదిరిగానే కోవిడ్-19 కూడా ఎప్పటికీ పోదని …
Read More »భారత్‌కు అమెరికా ఆర్థిక సాయం….
కరోనా మహమ్మారిపై పోరాడుతున్న భారత్‌కు అమెరికా నుంచి భారీ ఆర్థిక సాయం అందనుంది. రూ.3.6 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందించబోతున్నట్టు అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకటించింది. దేశంలో కోవిడ్ ప్రయోగశాలల సామర్థ్యాన్ని పెంచడం, ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్(ఐపీసీ) కేంద్రాలను అభివృద్ధి చేయడం, కరోనా కేసుల గుర్తింపు తదితర వాటి కోసం ఈ నిధులను ఉపయోగించనున్నారు.
Read More »