Breaking News
Home / Health / డయాబెటీస్‌కి కారణాలు, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

డయాబెటీస్‌కి కారణాలు, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అమరావతి :షుగర్ వ్యాధి.. ఈ సమస్య వచ్చిన తర్వాత బాధపడే బదులు.. ముందునుంచే జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా. ఏయే అలవాట్లు డయాబెటిస్కి కారణం. వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటివన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

డయాబెటిస్ రకాలు.. డయాబెటిస్‌‌‌లో అనేక రకాలు ఉన్నాయి..

టైప్ 1 డయాబెటిస్ : ఫాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోతుంది. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ నిల్వలు పెరుగుతాయి.. ఎందుకిలా జరుగుతుందనేది శాస్త్రవేత్తలు ఇంతవరకూ గుర్తించలేదు.
షుగర్ వ్యాధి ఉన్నవారిలో దాదాపు 10 శాతం మందికి ఈ టైప్ 1 ఉంది.
టైప్ 2 డయాబెటిస్ : క్లోమగ్రంధి తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు. ఒకవేళ ఉత్పత్తి అయినా సమర్థంగా పనిచేయదు. మధ్యవయస్సువారు, వయో వృద్ధుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అధిక బరువు, శరీర శ్రమలేనివారికి ఇది ఎక్కువగా ఉంటుంది.
కొందరు మహిళలకు గర్భ సమయంలో టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. గర్భంలోని శిశువకు అవసరమైనంత ఇన్సులిన్‌ని వారి శరీరాలు ఉత్పత్తి చేయలేకపోవటమే ఇందుకు కారణం. ఆహార నియమాలు, శారీరక వ్యాయామం అవసరమైతే ఇన్సులిన్‌ని వాడటం ద్వారా చక్కెర స్థాయిని నియంత్రించుకోవాల్సి ఉంటుంది.

డయాబెటిస్ లక్షణాలు..

మూత్రవిసర్జన ఎక్కువగా చేయడం, రాత్రిపూట మరీ ఎక్కువగా..
అధికంగా దాహం వేయటం.
అలసిపోయినట్లు అనిపించడం..
చూపు తగ్గడం..
శరీరం మీద గాయాలు, దెబ్బలు మానకపోవడం
ఇవే కాక మరీ కొన్ని లక్షణాలు కూడా కనబడతాయి. కొన్ని సార్లు ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే డయాబెటీస్ దాడి చేస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

మధుమేహం జన్యు సంబంధిత, పరిసరాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఆహార నియమాలు, జీవనశైలి సరిగ్గా ఉంటే షుగర్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.
చక్కెరకు దూరంగా ఉంటూ పండ్లు, కూరగాయలు, బీన్స్, సంపూర్ణ తృణధాన్యాలను మీ ఆహారంలో చేర్చుకోండి.
ఆరోగ్యకరమైన నూనెలు, పప్పులు, సార్డిన్లు, ఒమెగా 3 ఉండే ఫుడ్ తీసుకోవడం మంచిది.
వ్యాయామం చాలా ముఖ్యం. వారానికి కనీసం రెండున్నర గంటల పాటు ఏదైనా ఒక వ్యాయామం చేస్తూ ఉండాలి.
ఖచ్చితంగా తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లని ఎక్కువగా తీసుకోవాలి.
వీటితో పాటు చక్కెర శాతాన్ని తగ్గించుకోవడం చేస్తుండాలి. శీతలపానీయాలు, కాఫీ, టీలలో చక్కెర శాతాన్ని తగ్గించడం మంచిది.
అదే విధంగా సరైన సమయానికి పడుకోవడం, నిద్రలేవడం చేస్తుండాలి. నిద్ర ఎక్కువైనా, తక్కువైనా ఆరోగ్య సమస్యలు కామన్. కాబట్టి ఎలాంటి రిస్క్ చేయొద్దు.
అదేవిధంగా.. ఎప్పటికప్పుడూ పరీక్షలన్నీ చేయించుకోవాలి.
డయాబెటీస్ వ్యాధి అన్నీ సమస్యలకు మూలం. కాబట్టి ఈ సమస్య రాకముందు నుంచే జాగ్రత్త పడడం చాలా ముఖ్యం.

Check Also

క‌రోనాలో కొత్త‌గా ఆరు ల‌క్ష‌ణాలు..

Share this on WhatsAppఇప్ప‌టివ‌ర‌కు జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబును మాత్ర‌మే క‌రోనా ల‌క్ష‌ణాలుగా ప‌రిగ‌ణించాం.. కానీ ఇప్పుడు అది రూటు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *