Breaking News
Home / National / దోమల పెరుగుదలకు కారణమైనందుకు…

దోమల పెరుగుదలకు కారణమైనందుకు…

చెన్నై: తిరువళ్లూర్‌ పట్టణంలో దోమల ఉత్పత్తికి కారణమైన దుకాణాల యజమానుల నుంచి రూ.2.63 లక్షల జరిమానాను వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో డెంగ్యూ వ్యాధిని అరికట్టేలా జిల్లా యంత్రాంగం పలు ముందస్తు చర్యలను చేపట్టింది. అలాగే, పలు ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు పర్యటిస్తూ దోమల ఉత్పత్తిని గుర్తించి నివారణ చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఇటీవల మున్సిపాలిటీ కమిషనర్‌ మారిసెల్వి నేతృత్వంలోని బృందం పట్టణంలో తనిఖీలు చేపట్టి దోమల ఉత్పత్తికి కారణమైన ఇళ్లు, దుకాణాల యజమానులు మొత్తం 63 మంది నుంచి రూ.2 లక్షల 63 వేల 700లు జరిమానాగా వసూలు చేయగా, భవిష్యత్తులో తనిఖీలు కొనసాగుతాయని కమిషనర్‌ హెచ్చరించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *