Breaking News
Home / States / Andhra Pradesh / నవంబర్ 1 ని ఘనంగా జరుపుకోవాలి…

నవంబర్ 1 ని ఘనంగా జరుపుకోవాలి…

విజయవాడ: నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రశంసలతో ముంచెత్తారు. ‘తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాన్నే త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములను జ్ఞాపకం చేసుకుంటూ, నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుతున్న సీఎంకు హృదయపూర్వక ధన్యవాదాలు’ అని చెప్పారు.

పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ తర్వాత 1953, అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, 1956 నవబంర్ 1న భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గా అవతరించిందన్నారు. నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుతామని  జగన్ గతంలో మాట ఇచ్చారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, ఆరేళ్ళ తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోబోతున్నామని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలను మన చరిత్రకు, మహనీయుల త్యాగాలకు నిదర్శనంగా రాష్ట్రవ్యాప్తంగా జరుపుకోవాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *