సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. యస్ ఫౌండేషన్ చైర్మన్, మంత్రి జగదీష్ రెడ్డి సతీమణి సునీతా జగదీష్ రెడ్డి బతుకమ్మ ఆడారు. బతుకమ్మను రాష్ట్ర పండుగగా ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు నీరాజనాలు పలుకుతున్నారు. అటువంటి పండుగను గల్లీ నుండి ఢిల్లీ వరకు జరుపుకునేందుకు తెలంగాణా బిడ్డలు పోటీ పడుతున్నారు. ప్రపంచ దేశాలలో స్థిరపడిన తెలంగాణా బిడ్డలు బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారని చెప్పారు.
