Breaking News
Home / National / ముందంజతో ధీమా వ్యక్తం…సంబరాలతో స్వీట్స్….

ముందంజతో ధీమా వ్యక్తం…సంబరాలతో స్వీట్స్….

ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు ప్రారంభమైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ నాగ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన ముందంజలో ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని చోట్ల కూడా భాజపా అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు మొదలు పెట్టారు. మరోవైపు భాజపా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ రాష్ట్రంలోని పార్టీ కార్యాలయంలో మిఠాయిలు కూడా సిద్ధం చేస్తున్నారు. సుమారు 5 వేల లడ్డూలు తయారు చేస్తున్నట్లు స్థానిక నేతలు తెలిపారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలే భాజపా-శివసేన కూటమిని గెలిపిస్తాయని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. విజయోత్సవ సంబరాలు చేసుకునేందుకు పార్టీ కార్యాలయాన్ని అలంకరించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *