Breaking News
Home / National / ఢిల్లీలో నాలుగు రోజులపాటు సంక్రాంతి సంబరాలు

ఢిల్లీలో నాలుగు రోజులపాటు సంక్రాంతి సంబరాలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో నాలుగు రోజుల పాటు సంక్రాంతి వేడుకలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏపీ భవన్‌ను విద్యుత్ కాంతులతో, పూలతో అలంకరించారు. కాగా మొదటి రోజు వేడుకల్లో భాగంగా ఏపీ భవన్ అధికారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలను ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ దగ్గర ఉండి పర్యవేక్షించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో ఢిల్లీలోని తెలుగు వారు పాల్గొన్నారు.

Check Also

రాజ్‌కోట్ పట్టణంలో విచిత్ర నాగుపాము కలకలం

Share this on WhatsAppరాజ్‌కోట్: గుజరాత్‌లోని రాజ్‌కోట్ పట్టణంలో విచిత్రమైన రీతిలో గోధుమవర్ణపు నాగుపాము కలకలం రేపింది. రాజ్‌కోట్‌లోని 150 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *