పాట్నా: దేశంలో 49 మంది సెలబ్రిటీలపై నమోదు చేసిన దేశద్రోహం కేసును పోలీసులు ఎత్తివేశారు. మూక దాడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన 49 మంది సెలబ్రిటీలపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన న్యాయవాది సుధీర్ కుమార్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన విషయం విదితమే.
