Breaking News
Home / National / జూన్‌లో రైళ్ల కూత.. బస్సులపై అస్పష్టత

జూన్‌లో రైళ్ల కూత.. బస్సులపై అస్పష్టత

ఈలోపే రైళ్లను ప్రారంభించాలని ఒకరిద్దరు మంత్రుల సూచన
17న తుది నిర్ణయం..వారం తర్వాత గ్రీన్‌ జోన్లలో ఆర్టీసీ బస్సులు
నెలాఖరు వరకు ఆగితేనే మంచిదంటూ వైద్యుల సూచనలు
 హైదరాబాద్‌: జూన్‌ తొలి వారంలో ప్రజా రవాణాను ప్రారంభించేలా కేంద్రం యోచిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో ఇప్పటికిప్పుడు ప్రజా రవాణా ప్రారంభించటం సరికాదని నిపుణు లు హెచ్చరిస్తున్నా, ఇప్పటికే లాక్‌డౌన్‌ వల్ల 50 రోజులుగా ప్రజలు ఇళ్లకే పరిమితమైన నేపథ్యం లో.. ప్రజా రవాణా ప్రారంభించాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం కేసుల సంఖ్య అధికంగా ఉన్నందున, జూన్‌ మొదటి వారంలో ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. ఆర్టీసీలపై రాష్ట్రాలకే నిర్ణయాన్ని వదిలేసింది. ఇటీవలే గ్రీన్‌జోన్‌లలో బస్సులు తిప్పుకునేందుకు వెసులుబాటు కలిగించిన విషయం తెలిసిందే. వాటిని తిప్పాలా వద్దా అన్నది మాత్రం రాష్ట్రాలకే వదిలేసింది. ఆరెంజ్, రెడ్‌ జోన్లలో మాత్రం అనుమతి ఇవ్వలేదు.

ఇక తన పరిధిలో ఉన్న రైల్వే విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈనెలాఖరు వరకు రైళ్లను తిప్పొద్దని స్వయంగా రైల్వే బోర్డు అభిప్రాయపడింది. దీంతో జూన్‌ మొదటివారంలో రైళ్లను ప్రారంభించాలని భావిస్తోంది. ప్రస్తుతం సరుకు రవాణా రైళ్లు పెద్ద సంఖ్యలో తిరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా గల వలస కూలీలను సొంత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా శ్రామిక్‌ స్పెషల్స్‌ పేరుతో సాధారణ రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక సాధారణ రైళ్లను ప్రారంభిస్తే, ప్రయాణికుల మధ్య భౌతిక దూరం నిబంధన అంతగా అమలయ్యే అవకాశం లేదు. ఇదే భయం కేంద్రాన్ని వెంటాడుతోంది. ఈనెల 17 కేంద్రం లాక్‌డౌన్‌ విషయంలో సమీక్షించనుంది. ఆ సందర్భంగా రైళ్ల విషయంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒకరిద్దరు మంత్రులు మాత్రం 17 తర్వాత రైళ్లను నడపాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నిర్వహించే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారు.

Check Also

త్వరలో ఇంటి సహాయకులు, ఆటోవాలాలు, రోజువారీ కూలీలకు కరోనా పరీక్షలు

Share this on WhatsAppదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. ఢిల్లీలో పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపధ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *