Breaking News
Home / National / కేంద్ర రైల్వే శాఖ సరికొత్త విధానానికి నాంది…

కేంద్ర రైల్వే శాఖ సరికొత్త విధానానికి నాంది…

ముంబయి: రైళ్ల ద్వారా సినిమాలను ప్రమోట్‌ చేసుకునే సరికొత్త విధానానికి రైల్వేశాఖ నాంది పలికింది. ఈ సరికొత్త విధానాన్ని సినీ రంగంలోని ప్రతిఒక్కరూ ఉపయోగించుకోవాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ కోరారు. ఈ మేరకు ఆయన సోషల్‌మీడియా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. ”ప్రమోషన్‌ ఆన్‌ వీల్స్‌’ రైల్వే వారు చేపట్టిన సరికొత్త ఆలోచన. బాలీవుడ్‌లో రానున్న ‘హౌస్‌ఫుల్‌-4′ సినిమాని ప్రమోట్‌ చేస్తూ అక్టోబర్‌ 16, 17 తేదీల్లో ఒక ప్రత్యేక రైలు ముంబయి నుంచి ఢిల్లీకి వెళ్లనుంది. ఈ రైలు ప్రయాణంలో ఆ చిత్రబృందం కూడా ఉంటుంది. ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందుకు సినీ ప్రముఖులు ఈ విధమైన ప్రమోషన్స్‌ను ఉపయోగించుకోవాలని కోరుతున్నాను.’ అని గోయల్‌ పేర్కొన్నారు.

త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘హౌస్‌ఫుల్-4’ సినిమాని ప్రమోట్‌ చేసేందుకు అక్టోబర్‌16న ఈ ప్రత్యేక రైలు ముంబయి నుంచి బయలుదేరింది. ఈ రైలు సర్వీసుకు తాత్కాలికంగా ‘హౌస్‌ఫుల్‌-4’ ఎక్స్‌ప్రెస్‌ అని పేరు పెట్టారు. ఈ రైలు ప్రయాణంలో ఆ సినిమాకు సంబంధించిన చిత్రబృందం పాల్గొంది. దీనికి సంబంధించిన ఫొటోలను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *