హైదరాబాద్: చంచల్గూడ జైల్లో ఖైదీగా ఉన్న అశోక్ (34) అనే వ్యక్తి మృతిచెందాడు. ఓ కేసులో రెండ్రోజుల క్రితమే జైలుకొచ్చిన అతడు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు అశోక్ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంది.
