Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / కొలిక్కిరానున్న టీ.టీడీపీ అభ్యర్థుల కసరత్తు

కొలిక్కిరానున్న టీ.టీడీపీ అభ్యర్థుల కసరత్తు

అమరావతి: తెలంగాణ టీడీపీ అభ్యర్థుల కసరత్తు ఈరోజు ఓ కొలిక్కిరానుంది. మరికాసేపట్లో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సమావేశంకానున్నారు. మహాకూటమిలో టీటీడీపీ కేటాయించిన సీట్ల వివరాలను సీఎంకు వెల్లడించనున్నారు. టీడీపీ పోటీ చేయనున్న సీట్లు, అభ్యర్థులపై ప్రధానంగా చర్చించనున్నారు. సీట్ల విషయంలో పట్టుబట్టకుండా, గెలిచే సీట్లను విడవకుండా వ్యూహాన్ని ముందుకు తీసుకువెళ్లాలని టీ.టీడీపీ నేతలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ టికెట్ ఆశిస్తున్న ఇబ్రహీంపట్నం నుంచి భీంరెడ్డి, ఎల్బీనగర్ నుంచి సామరంగారెడ్డి కొద్దిసేపటి క్రితమే సీఎంను కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు.

మరోవైపు ఈ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు కర్ణాటక బయలుదేరి వెళ్లనున్నారు. ఢిల్లీ స్థాయిలో ఉత్తరాదిలో ఉన్న ప్రధాన పార్టీలన్నింటికీ ఒకే వేదికపైకి తీసుకువచ్చిన సీఎం… దక్షిణాదిలో ఉన్న ప్రధాన పార్టీలు జేడీఎస్, డీఎంకే పార్టీల నేతలను కలిసి జాతీయస్థాయిలో మహాకూటమి ఏర్పాటుపై చర్చించనున్నారు. ఇందులో భాగంగా కర్ణాటక సీఎం కుమారస్వామి, మాజీ ప్రధాని దేవగౌడతో భేటీ అయి అనంతరం తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్‌తో సీఎం చంద్రబాబు భేటీ అవనున్నారు.

Check Also

పిల్లలను అపహరిస్తున్న అంతరాష్ట్ర ముఠా అరెస్ట్

Share this on WhatsAppహైదరాబాద్: పిల్లల్ని అపహరించి.. డబ్బుల్లేని వారికి పిల్లలను అమ్మడం.. వచ్చిన డబ్బులతో జల్సాలు చేయడం.. ఇది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *