Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / జీవీఎల్‌ పుస్తకం గురించి చంద్రబాబు ఏమన్నారంటే..

జీవీఎల్‌ పుస్తకం గురించి చంద్రబాబు ఏమన్నారంటే..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగానే అన్ని రాష్ట్రాల్లో ఈవీఎంలు మొరాయించాయని సీఎం చంద్రబాబు అన్నారు. బెంగాల్‌లో ఏడు దశల్లో ఎన్నికలు పెట్టారని.. హింస, విధ్వంసాలతో పోలింగ్‌ శాతాన్ని దెబ్బతీసే కుట్రలు చేశారని ఆరోపించారు. టీడీపీ పోరాటం వల్లే వీవీ ప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు 5 శాతానికి పెరిగిందన్నారు. 50 శాతం వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలని కోర్టుకు వెళ్లినట్లు తెలిపారు. యూపీలో ఎస్పీకి ఓటేస్తే బీజేపీకి పడ్డాయని పేర్కొన్నారు. అలాగే మధ్యప్రదేశ్‌, బెంగాల్‌లోనూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయని తెలిపారు. మేం ఒక్క ఆంధ్రప్రదేశ్‌ గురించి మాత్రమే మాట్లాడటంలేదన్నారు. వీవీ ప్యాట్లు లెక్కించేందుకు 6 రోజుల సమయం పడుతుందంటున్నారని.. పేపర్‌ బ్యాలెట్లే రెండు రోజుల్లో లెక్కించేవారని గుర్తుచేశారు. ఈవీఎంలపై తన దగ్గర ఉన్న సమాచారం తీసుకుని జీవీఎల్‌ పుస్తకం రాశారన్నారు. ఇప్పుడు ఈవీఎంలను జీవీఎల్‌ సమర్థిస్తున్నారన్నారు.

Check Also

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ

Share this on WhatsAppఏలూరు: సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ (బీఏఎస్‌) పథకంలో 2019-20 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *