Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ‘యువనేస్తం’ పథకాన్ని విజయవంతం చేయాలి: చంద్రబాబు

‘యువనేస్తం’ పథకాన్ని విజయవంతం చేయాలి: చంద్రబాబు

అమరావతి: రేపటి నుంచి ప్రారంభంకాబోయే ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని విజయవంతం చేయాలని, ఎల్లుండికల్లా ఆయా ఖాతాలలో రూ.1,000 చొప్పున జమ చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సోమవారం నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రపంచం మొత్తం మన ప్రకృతి సేద్యం వైపు చూస్తోందని, ఏపీ ప్రకృతి సేద్యం ప్రపంచానికే నమూనా కావాలని సీఎం ఆకాంక్షించారు. ఐక్యరాజ్యసమితిలో రాష్ట్రానికి మంచి గుర్తింపు లభించిందన్నారు. అటు ప్రకృతి, ఇటు సాంకేతికత అద్భుతమైన జోడి అని, రెండింటినీ సమర్ధంగా వినియోగించుకోవడమే ఏపీ ఘనతని అని చెప్పుకొచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే ముందున్నామని పేర్కొన్నారు.

Check Also

కవిత పిటిషన్‌పై ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఏపీ ప్రభుత్వం

Share this on WhatsAppఅమరావతి: పోలవరంపై ఎంపీ కవిత సుప్రీంకోర్టులో వేసిన కేసుల వివరాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *