Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / క్షమాపణ చెబితే బాగుటుంది….

క్షమాపణ చెబితే బాగుటుంది….

అమరావతి : ప్రతిపక్ష నేత చంద్రబాబు సభకు క్షమాపణ చెబితే గౌరవంగా ఉంటుందని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. ఇవాళ సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బీసీ వర్గానికి చెందిన వ్యక్తి సభకు నాయకత్వం వహించి సభను చక్కగా నడిపిస్తున్నారు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు వ్యవహరించిన తీరు అభ్యంతరకరం. సభలో జరిగిన పరిణామాలను యావత్‌ ప్రజలు గమనిస్తున్నారు. చట్టసభలో ఏం నేర్చుకుంటున్నాం. సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారు. మహానేత వైఎస్సార్‌ కలలను నెరవేర్చే అవకాశం వచ్చింది. అందరం మర్యాదగా నడుచుకోవాలి. ప్రతిపక్ష నేత ఇప్పటికైనా తన తీరు మార్చుకుంటే బాగుంటుంది’అని సూచించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *