విజయవాడ: టీడీపీ కార్యకర్తలందరికీ అండగా ఉంటామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. పులివెందుల పంచాయతీతో రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేయొద్దని, టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు ఇష్టానుసారం వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వైసీపీ నేతలు ప్రజలు ఛీకొట్టేలా చేసుకోవద్దని, వైసీపీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోందని చంద్రబాబు దుయ్యబట్టారు.
