Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / జగన్ వ్యాఖ్యలను విమర్శించిన చంద్రబాబు

జగన్ వ్యాఖ్యలను విమర్శించిన చంద్రబాబు

అమరావతి: ఏపీ అసెంబ్లీలో కరవుపై చర్చ సందర్భంగా అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 2014 నుంచి 2019 వరకు సున్నా వడ్డీ పథకం కింద ఎంత ఇచ్చారో చెప్పాలని చంద్రబాబుకు సీఎం జగన్‌ సవాల్‌ విసిరారు. దీంతో జగన్ వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో రైతులకు విత్తనాలు ఇవ్వలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని తీవ్రస్థాయిలో విమర్శించారు. విత్తనాలు కూడా ఇవ్వలేని జగన్ ఈ ఐదేళ్లలో ఏం చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. జీడీపీ లెక్కలు ఆర్థికమంత్రి, తాను రాసేవి కావని అన్నారు. ఆ విషయం తెలియకుంటే ఇంట్లో కూర్చొని లెక్కలు రాసుకోవాలని బాబు ఎద్దేవా చేశారు.

టీడీపీ హయాంలో వ్యవసాయంలో దేశంలోనే ఏపీ నెంబర్‌ వన్‌గా ఉందని చంద్రబాబు అన్నారు. వైఎస్‌ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న 14,500 మంది రైతులకు కూడా పరిహారం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. విపక్షనేతగా ఉన్న జగన్‌ మమ్మల్ని ఎన్నిసార్లు అభినందించారని ఆయన ప్రశ్నించారు. ఎవరికైనా అధికారులే రికార్డులు ఇస్తారన్నారు. అధికారులు రికార్డులు ఇవ్వకుంటే జగన్‌ చెప్పే పరిస్థితుల్లో లేరని చంద్రబాబు విమర్శించారు.

Check Also

చిల్డ్రన్‌ ట్రాఫిక్‌ శిక్షణ పార్క్‌ ప్రారంభం…

Share this on WhatsAppనాగోలు: భారతదేశం అగ్రరాజ్యంగా ఎదిగేందుకు రోడ్డు భద్రత ముఖ్యభూమిక పోషిస్తుందని రాష్ట్ర అదనపు డీజీపీ జితేందర్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *