శ్రీకాకుళం: శ్రీకాకుళంలో ఈరోజు టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ… నాయకులు వెళ్లినంత మాత్రాన టీడీపీకి ఎలాంటి నష్టం లేదని అన్నారు. ఒక నాయకుడు పోతే వంద మంది నేతలు పుడతారన్నారు. తెలుగు జాతి ఉన్నంతవరకూ టీడీపీ ఉంటుందన్నారు. టీడీపీకి శ్రీకాకుళం జిల్లాకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. జగన్ కిల్లర్ రాజకీయాలు టీడీపీ దగ్గర పనిచేయవన్నారు. జగన్ డౌన్ డౌన్ అంటే పోలీసులు కేసులు పెడతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనను నడి రోడ్డుపై ఉరి తీయాలని జగన్ చేసిన వ్యాఖ్యలు పోలీసులకు కనపడలేదా? అని ప్రశ్నించారు.
