Breaking News
Home / States / Andhra Pradesh / లా అండ్ ఆర్డర్‌ను భ్రష్టు పట్టిస్తున్నారు….

లా అండ్ ఆర్డర్‌ను భ్రష్టు పట్టిస్తున్నారు….

శ్రీకాకుళం : కేసుల పేరుతో టీడీపీ కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. వైసీపీ నేతల వేధింపులకు గురైన కార్యకర్తలతో ఇక్కడి పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. జిల్లాలో 12 కేసుల్లో 86 మందిని వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు ఇష్టానుసారంగా తయారయ్యారని విమర్శించారు. పక్షపాత వైఖరిని అవలంభిస్తూ లా అండ్ ఆర్డర్‌ను భ్రష్టు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు న్యాయబద్దంగా వ్యవహరించడం లేదన్నారు. ధృడసంకల్పంతో ముందుకు వెళ్లి న్యాయస్థానాల్లో పోరాడతామన్నారు. ఇష్టానుసారం కేసులు పెడితే.. తాము ప్రైవేటు కేసులు పెడతామని చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని నేర ఆంధ్రప్రదేశ్‌గా తయారు చేశారని ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఒక పద్ధతి ప్రకారం పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు హితవు చెప్పారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *