Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / చావు బాజా మోగించాక.. వారోత్సవాలేమిటి ?…

చావు బాజా మోగించాక.. వారోత్సవాలేమిటి ?…

అమరావతి : వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికార పార్టీ నాయకుల్లో ఊరికో ఇసుకాసురుడు ఆవిర్భవించారని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందు వారి భరతం పట్టి ఆ తర్వాత ఉత్సవాలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఇసుక నియంత్రణ పేరుతో వైసీపీ నాయకులు తమ జేబులను నింపుకుంటున్నారని ధ్వజమెత్తారు. సొంత ఊరిని ఆనుకుని ప్రవహిస్తున్న వాగు నుంచి ఇసుక తీసుకు వెళ్లాలన్నా అనుమతులు ఏమిటని ప్రశ్నించారు. ఇసుక కొరత కారణంగా ఆరుగురు కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, దానిపై మాట్లాడకుండా వారోత్సవాలు నిర్వహిస్తామనడం సిగ్గుచేటన్నారు. చావు బాజా మోగించాక వారోత్సవాలు ఏమిటని ఎద్దేవా చేశారు. తెలంగాణలో లేని ఇసుక కొరత ఎపీలోనే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *