Breaking News
Home / States / Andhra Pradesh / వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు….

వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు….

నెల్లూరు: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలు ఉన్మాదంతో దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులు, అధికారులపై దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ఇది నేరస్థుల ప్రభుత్వమన్నారు. అక్రమ కేసులతో టీడీపీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పార్టీ మారకపోతే దాడులు చేస్తామంటూ వైసీపీ వాళ్ళు బెదిరిస్తున్నారని ఆరోపించారు. బలహీన వర్గాలను వేధించడమే వైసీపీ పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.

వైసీపీ దాడులతో నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. ”నేను మీలాగే వ్యవహరిస్తే వైసీపీ నేతలు ఎక్కడ ఉండేవారు?. దొంగసారా, బెట్టింగ్‌ కాసే వాళ్ళు ఎమ్మెల్యేలా?” అని చంద్రబాబు ప్రశ్నించారు. కేసుల పేరుతో మహిళలను వేధిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వైసీపీ ఎమ్మెల్యేకు పిచ్చి పట్టింది..మహిళల జోలికొస్తే తాట తీస్తానని తీవ్రంగా హెచ్చరించారు. జగన్ జేఎస్టీని తలపిస్తూ లోకల్ ఎమ్మెల్యేలు లోకల్ టాక్స్‌కు తెరతీస్తున్నారని పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *