అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలు గత కొన్నిరోజులుగా నిలిచిపోయిన విషయం విదితమే. అయితే ఈ వ్యవహారంలో ఇప్పటికే పలుమార్లు డీటీశాట్ స్పందిస్తూ ఏబీఎన్ ఛానెల్‌ను పునరుద్దరించాలంటూ తేల్చిచెప్పింది. ఈ వ్యవహారంపై తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
మొట్టికాయలు వేస్తున్నా మార్పు రాదా!? ‘ఏపీలో ఏబీఎన్ ప్రసారాల నిలుపుదలపై టీడీశాట్ విచారణలో సాంకేతిక కారణాలంటూ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది?. కోర్టుల ముందు ఒక తీరుగా.. పాలనలో మరో రకంగా ప్రభుత్వం ఎందుకుంటోంది?. చేస్తున్నవి తప్పుడు పనులనేగా అర్ధం అని విమర్శించారు. అప్పిలేట్ ట్రిబ్యునల్స్, ఉన్నత న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా వైసీపీలో మార్పు రాదా?. ఇప్పటికైనా ప్రభుత్వ ధోరణి మారాలని, లేకపోతే ఇలాగే ఎదురుదెబ్బలు తినాల్సి వస్తుంది’ అని ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్‌పై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.