అమరావతి: కృష్ణా జిల్లా టీడీపీ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఎంపీ కేశినేని నాని, పలువురు సీనియర్ నేతలు హాజరైయ్యారు. వల్లభనేని వంశీ వ్యవహారంపై చర్చిస్తున్నారు. కాగా కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ.. ఆయన తన లేఖను చంద్రబాబు పంపారు.
