Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / సభలో నిలదీస్తే టీడీపీని అణచివేస్తారా?…

సభలో నిలదీస్తే టీడీపీని అణచివేస్తారా?…

అమరావతి: ఏపీ ప్రభుత్వం.. మీడియా, టీడీపీ గొంతు నొక్కుతోందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే ముందు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు బాబు పలు కీలక సూచనలు చేశారని తెలుస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారంపై సీఎం జగన్‌కు శ్రద్ధ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీని అణిచేయడంపైనే వైసీపీ దృష్టి పెట్టిందని ఆయన మండిపడ్డారు. పేదల కష్టాలపై సభలో నిలదీస్తే టీడీపీని అణచివేస్తారా..? అంటూ బాబు ఆగ్రహానికి లోనయ్యారు.

ఉల్లిని ఇంటింటికీ డోర్ డెలివరీ చేయాలి!
ఉల్లి ధరలపై ప్రజల్లో వ్యతిరేకతను నిన్న సభలో ప్రతిధ్వనింపచేశామని.. ప్రజల కష్టాలను, మహిళల అవస్థలను సభ దృష్టికి తేవాలని ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్లుకు బాబు పిలుపునిచ్చారు. ఉల్లి కోసం వెళ్తే ఉసురు తీయడం అమానుషమని ఆయన అన్నారు. ఉల్లిని ఇంటింటికీ డోర్ డెలివరీ చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఉల్లి డోర్ డెలివరీ చేయకపోతే వాలంటీర్లకు జీతాలు దండగ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *