Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / రేవంత్ రెడ్డి కామెంట్స్‌పై స్పందించిన చంద్రబాబు

రేవంత్ రెడ్డి కామెంట్స్‌పై స్పందించిన చంద్రబాబు

రేవంత్ రెడ్డి: ఏపీ రాజధాని అమరావతి గందరగోళంగా మారడం తెలంగాణవాదిగా సంతోషం కలిగిస్తోందని, కానీ.. భారత పౌరుడిగా బాధగా ఉందని అన్నారు. తెలంగాణ పౌరుడిగా ఎందుకు సంతోషంగా ఉందంటే.. ఏపీ రాజధాని గందరగోళంలో పడటం వల్ల హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి చెందుతూ తెలంగాణకు ఆదాయం పెరిగిందని, అందుకే తెలంగాణవాదిగా సంతోషిస్తున్నానని తెలిపారు. రెండోది బాధగా ఉందని అన్నారు. నిన్నటివరకు సోదరుల్లాగా ఉన్నవారంతా కొట్లాడుకుంటుండటంతో భారత పౌరుడిగా బాధగా ఉందని చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అపార్ట్‌మెంట్లను అమ్ముకోవడానికి ఏపీలో గందరగోళం సృష్టించారని, ఆనాడు ఎన్నికల్లో సాయం చేసిన వ్యాపారికి మేలు జరగడం కోసం ఇలాంటి పరిస్థితి తేవడం బాధ కలిగిస్తోందన్నారు.

చంద్రబాబు: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ బాగా అభివృద్ధి చెందుతోందని రేవంత్ రెడ్డి అన్నారని, కానీ ఏపీకి అన్యాయం జరుగుతుందని ఒక భారతీయుడుగా బాధపడుతున్నానని అన్నారన్నారు. అలాగే తెలంగాణ మంత్రి కూడా ఏపీపై మాట్లాడారన్నారు. ఇదే సరైన సమయమని, రియలిస్టేట్లు సిద్ధంగా ఉండాలని పిలుపు ఇచ్చారన్నారు. ఏపీ మూడు ముక్కలైందని, జగన్ మూడు ముక్కల పేకాట ఆడుతున్నారని, తెలంగాణకు మంచి భవిష్యత్ ఉందని ఆ మంత్రి చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు గుర్తు చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *