అమరావతి : గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లేఖపై చంద్రబాబు స్పందించారు. లేఖలో ప్రస్తావించిన అంశాలను గతంలోనే తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. రాజకీయాల నుంచి తప్పుకున్నంత మాత్రాన వైసీపీ నేతల అరాచకాలు ఆగిపోవంటూ వంశీకి సమాధానం ఇచ్చారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్న దానిపై మనమంతా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీపై పోరాటంలో అండగా ఉంటామని వంశీకి చంద్రబాబు భరోసా ఇచ్చారు. పార్టీపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా అండగా ఉంటానని, రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై రాజ్యాంగ సంస్థలకు ఫిర్యాదు చేద్దామని సూచించారు.
