Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / చంద్రబాబును సస్పెండ్ చేయాల్సిందే…

చంద్రబాబును సస్పెండ్ చేయాల్సిందే…

 అమరావతి : శాసనసభలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ స్థానాన్ని ప్రతిపక్ష పార్టీ నేతలు లెక్కచేయడం లేదని అన్నారు. చంద్రబాబు, ఇతర టీడీపీ సభ్యులు సభలో అనుచితంగా వ్యవహరిస్తున్నారని స్పీకర్‌ వ్యాఖ్యానించారు. పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం అంశంపై చర్చ సందర్భంగా టీడీపీ నాయకుల తీరును వైసీపీ ఎమ్మెల్యేలు తప్పుబట్టారు. నలభై ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు సభా మర్యాదలు తెలియవని, స్పీకర్‌పై అమర్యాదగా మాట్లాడటం ఏంటని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు.

స్పీకర్‌ స్థానాన్ని ప్రతిపక్షనేత చంద్రబాబు అగౌరవ పరిచారని, స్పీకర్‌ను పట్టుకొని మర్యాద ఉండదని అంటారా అని నిలదీశారు. స్పీకర్‌పై చంద్రబాబు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 40 ఏళ్ల అనుభవం ఉండి..14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబుకు సభా మర్యాదలు తెలియవా? అని ప్రశ్నించారు. బాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *