Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / వంశీపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్న చంద్రబాబు…

వంశీపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్న చంద్రబాబు…

అమరావతి: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని ప్రత్యేక స్థానాన్ని కల్పించటాన్ని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు తప్పుపట్టారు. వంశీ పార్టీ సస్పెన్షన్‌లో ఉన్నారన్నారు. అలా సస్పెన్షన్‌లో ఉన్నప్పుడు ప్రత్యేక స్థానం ఇవ్వకూడదని పేర్కొన్నారు. వంశీపై పూర్తి బహిష్కరణ వేటు పడితే తప్ప అతను ప్రత్యేక సభ్యుడు కాదన్నారు. పూర్తి బహిష్కరణ వేటు పడితే ఎమ్మెల్యేగా కూడా అనర్హుడేనని చంద్రబాబు చెప్పారు. ఈ విషయంపై రేపు గవర్నర్‌కు చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు కలిసి ఫిర్యాదు చేయనున్నారు. అలాగే మీడియాపై విధిస్తున్న ఆంక్షలపై కూడా ఫిర్యాదు చేయనున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *