Breaking News
Home / States / Andhra Pradesh / కాసేపట్లో పోలవరానికి చంద్రబాబు పర్యటన

కాసేపట్లో పోలవరానికి చంద్రబాబు పర్యటన

పోలవరం: సీఎం చంద్రబాబు కాసేపట్లో పోలవరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్‌ పనులను ఆయన పరిశీలిస్తారు. అధికారులు, కాంట్రాక్ట్‌ ఏజెన్సీలతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడం, ఎన్నికల ప్రచార సభలతో సీఎం బిజీగా ఉండడం వల్ల పోలవరం పనులపై సమీక్షలు నిర్వహించలేదు. ఏప్రిల్‌ 11న పోలింగ్‌ ముగిశాక పోలవరం పనులపై సీఎం ఒకసారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అయితే దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కానీ, ప్రస్తుతం అమలులో ఉన్న ప్రాజెక్టులు, పథకాలపై వీడియో కాన్ఫరెన్సు మినహా సమీక్ష నిర్వహించేందుకు ఎలాంటి అభ్యంతరాలూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో అధికారులకు కనిపించలేదు. దీంతో.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించడంలో తప్పేమీ లేదని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Check Also

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ

Share this on WhatsAppఏలూరు: సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ (బీఏఎస్‌) పథకంలో 2019-20 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *