Breaking News
Home / States / ఎన్టీఆర్‌ అమరజ్యోతి ర్యాలీకి చంద్రబాబుకు ఆహ్వానం

ఎన్టీఆర్‌ అమరజ్యోతి ర్యాలీకి చంద్రబాబుకు ఆహ్వానం

హైదరాబాద్ : ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఈనెల 18న బేగంపేటలో జరిగే ఎన్టీఆర్‌ అమరజ్యోతి ర్యాలీకి రావాలని ఏపీ సీఎం నారా చంద్రబాబును హైదరాబాద్‌ టీడీపీ నేతలు ఆహ్వానించారు. ఆన్‌ఇండియా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీపతి సతీష్‌ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కూన వెంకటేశ్‌గౌడ్‌, ఎంఎన్‌. శ్రీనివాస్‌, సారంగపాణి, గంగాధర్‌గౌడ్‌, సోమలింగం, రాజుతోపాటు పలువురు అమరావతిలోని చంద్రబాబునాయుడు నివాసంలో ఆయనను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 18న బేగంపేటలోని రసూల్‌పురలోని ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి అమరజ్యోతి ర్యాలీ ప్రారంభమై ఎన్టీఆర్‌ ఘాట్‌కు చేరుతుందని వివరించారు.

Check Also

ఎన్నికల ఫలితాలపై నారా భువనేశ్వరి స్పందన

Share this on WhatsAppహైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగరేసి.. ఊహించని మెజార్టీ సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *