Breaking News
Home / States / ఓటు వేయని సీఎం దంపతులు

ఓటు వేయని సీఎం దంపతులు

యాగం నిర్వహణలో ఉన్నందునే!
సిద్దిపేట రూరల్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దంపతులు పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోలేదు. కేసీఆర్‌ స్వగ్రామమైన సిద్దిపేట రూరల్‌ మండలం చింతమడకలో సోమవారం పంచాయతీ ఎన్నికలు తొలి విడతలో భాగంగా జరిగాయి. అయితే ఎర్రవల్లిలో తన వ్యవసాయ క్షేత్రంలో సీఎం యాగం నిర్వహిస్తుండటంతో ఓటుకు దూరమైనట్లు తెలిసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ దంపతులు చింతమడక గ్రామానికి వచ్చి ఓటు వేసిన విషయం తెలిసిందే.

Check Also

ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్న ఇస్రో శాస్త్రవేత్తలు

Share this on WhatsAppనెల్లూరు: చంద్రయాన్-2 మిషన్ విజయంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నారు. అందరి సమిష్టి కృషి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *