Breaking News
Home / States / Andhra Pradesh / చంద్రయాన్‌ 2 : ఆర్బిటర్‌ అద్భుతం….

చంద్రయాన్‌ 2 : ఆర్బిటర్‌ అద్భుతం….

ఇస్రో (నెల్లూరు): ఇస్రో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రయాన్‌-2 ప్రయోగంలో భాగంగా చందమామ చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్‌ అద్భుతమైన ఫొటోలు పంపుతోంది. ఆర్బిటర్‌ తీసిన చిత్రాలను ఇస్రో ట్వీట్‌ చేసింది. ఆర్బిటర్‌లో అమర్చిన ఎంతో కీలకమైన హై రిజల్యూషన్‌ కెమెరా ఈ ఫొటోలు తీసింది. చంద్రుడి నైసర్గిక స్వరూపం తెలుసుకునేందుకు ఈ ఫొటోలు ఉపయోగపడతాయని ఇస్రో తెలిపింది. సెప్టెంబరు 5న చంద్రుడికి 100 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఆర్బిటర్‌ ఈ ఫొటోలను తీసింది. దక్షిణ ధ్రువంలో 14 కిలోమీటర్ల వ్యాసం, 3 కిలోమీటర్ల లోతుతో ఉన్న ‘బోగుస్లాస్కై ఈ’ బిలాన్ని గుర్తించింది ఇస్రో. ఇందులో 5 మీటర్ల కన్నా తక్కువ వ్యాసమున్న రెండు చిన్న బిలాలను, 1 నుంచి 2 మీటర్ల ఎత్తున బండరాళ్లను ఇస్రో గుర్తించింది. కాగా, చంద్రయాన్‌ 2 ప్రయోగంలో కీలకమైన విక్రమ్‌ ల్యాండర్‌తో ఇస్రోకు సంబంధాలు తెగిపోగా ల్యాండర్‌ను గుర్తించినా దానితో సంబంధాలు పునరుద్ధరించేందుకు ఇస్రో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *