Breaking News
Home / States / హోంశాఖలోని కీలక పదవుల్లో మార్పులు…

హోంశాఖలోని కీలక పదవుల్లో మార్పులు…

హైదరాబాద్‌: తెలంగాణ హోంశాఖలోని రెండు కీలక పదవుల్లో మార్పులు జరిగాయి. హోంశాఖ కార్యదర్శిగా రవిగుప్తాను, జైళ్ల శాఖ డీజీగా రాజీవ్‌ త్రివేదిని నియమించారు. రవిగుప్తా ప్రస్తుతం తెలంగాణ అదనపు పోలీస్‌ డైరెక్టర్‌జనరల్‌(టెక్నాలజీ)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పురపాలక ఎన్నికలపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై దాదాపు స్పష్టత రావడంతో చేపట్టిన ఈ మార్పులు ప్రాధాన్యం సంతరించుకొన్నాయి. మరో 70 పురపాలక సంఘాలకు సంబంధించి పలు అంశాలపై దిగువ కోర్టుల్లో కేసులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇవన్నీ వీగిపోయే అవకాశాలున్నాయని అధికారులు అంచనాకు వచ్చారు. దీంతో కొద్దిరోజుల్లోనే ఎన్నికల నిర్వహణకు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికలు జరిపేందుకు సిద్ధంగా ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *