Breaking News
Home / Film News / ఖర్చు తగ్గిస్తూ కథలో మార్పులు….

ఖర్చు తగ్గిస్తూ కథలో మార్పులు….

ఫిల్మ్ న్యూస్: ‘సాహో’ సినిమా ఫలితం ప్రభాస్ ను ఆలోచనలో పడేసింది. కథకి .. ఖర్చు బలాన్ని చేకూర్చలేదనే విషయం ఆయనకి అర్థమైపోయింది. దాంతో తన తదుపరి సినిమా విషయంలో ఆయన జాగ్రత్తలు తీసుకున్నాడు.

‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ తదుపరి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కథపై ప్రభాస్, బడ్జెట్ ను కూడా దృష్టిలో పెట్టుకుని కొన్ని మార్పులను సూచించాడట. కథా కథనాల పరంగా ఆయన చేసిన సూచనలకి తగినట్టుగానే మార్పులను చేయడం పూర్తయింది. దాంతో వచ్చేనెలలో షూటింగుకి వెళ్లడానికి సన్నాహాలను మొదలుపెట్టినట్టు సమాచారం. అయితే కథలో మార్పులు చేయకముందు యూరప్ లో 20 రోజుల పాటు చిత్రీకరణ చేశారు. మరి ఆ సన్నివేశాలను ఉంచుతారో .. తీసివేస్తారో చూడాలి.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *