Breaking News
Home / National / అధికారం కోసం రంగులు మారుస్తున్నారు….

అధికారం కోసం రంగులు మారుస్తున్నారు….

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణల బిల్లుపై జరుగుతోన్న చర్చలో శివసేనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సెటైర్లు వేశారు. రాత్రికి రాత్రే ఏమైందని ప్రశ్నించారు. అధికారం కోసం రంగులు మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. పౌరసత్వ సవరణల బిల్లుకు లోక్‌సభలో మద్దతిచ్చిన శివసేన రాత్రికి రాత్రే మనసు ఎందుకు మార్చుకుందని ప్రశ్నించారు. బిల్లుకు రాజ్యసభలో మద్దతు ఇచ్చే విషయంలో శివసేన స్పష్టత ఇవ్వకపోవడంతో అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే హిందుత్వ విధానాన్ని వదులుకోవడం ఇష్టం లేక పౌరసత్వ సవరణల బిల్లుకు లోక్‌సభలో మద్దతు తెలిపింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో రాజ్యసభలో బిల్లుకు మద్దతు ఇవ్వాలా, వద్దా అనే విషయంపై శివసేన ఎటూ తేల్చుకోలేకపోతోంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *