ఫిల్మ్ న్యూస్: ఈ ఏడాది `ఇస్మార్ట్ శంకర్`తో భారీ హిట్ అందుకున్న హీరో రామ్ పోతినేని. ఈ యువ హీరో కెరీర్ బెస్ట్ మూవీ ఇది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ అయ్యింది. నభానటేశ్, నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించారు. ఈ సినిమా 100 రోజులను పూర్తి చేసుకున్న సందర్భంగా రామ్ ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు. `ఇస్మార్ట్ శంకర్ ఓ సినిమా మాత్రమే కాదు నా జీవితంలో ఓ అధ్యాయం. శంకర్ పాత్రను సినిమాలో బాగా ఎంజాయ్ చేశాను. నా కెరీర్లో ఇంత మంచి చిత్రాన్ని అందించిన పూరిజగన్నాథ్‌కు ధన్యవాదాలు. సంగీతం అందించిన మణిశర్మగారికి, నభా నటేశ్, నిధి అగర్వాల్ సహా చిత్ర యూనిట్‌కి థ్యాంక్స్“ అన్నారు.
ఈ ట్వీట్‌కు పూరి స్పందిస్తూ ” మిస్ యూ రామ్ నా జీవితంలో ఇస్మార్ట్ శంకర్ స్పెషల్ సినిమా. మనం మరోసారి కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాను. మరోవైపు ఛార్మి కూడా ఓ వీడియో పోస్ట్ చేసి తన స్పందనను తెలిపారు. ” ఈ వీడియో చూస్తే నాకు కన్నీళ్లు వస్తున్నాయి. కలల ప్రాజెక్ట్‌గా స్టార్ట్ చేసిన ఈ సినిమా కోసం మా జీవితాలను అంకితం చేశాం. మేం వెనక్కి తిరిగి చూసుకుంటే మా కల నిజమైందని గర్వంగా చెబుతున్నాను ” అన్నారు ఛార్మి.